ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ustaad Bhagat Singh: ఈసారి వినోదం మాత్రమే కాదు

ABN, First Publish Date - 2022-12-11T18:47:07+05:30

‘గబ్బర్‌ సింగ్‌’తో వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan), హరీశ్‌ శంకర్‌ (Harish shankar)దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh muhurat) చిత్రం రాబోతుంది. తొలుత ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ టైటిల్‌ను ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గబ్బర్‌ సింగ్‌’తో వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan), హరీశ్‌ శంకర్‌ (Harish shankar)దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh muhurat) చిత్రం రాబోతుంది. తొలుత ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ టైటిల్‌ను ప్రకటించారు. తాజాగా  ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’గా  టైటిల్‌ మార్చి ఆదివారం పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వి.వి. వినాయక్‌, కె.దశరథ్‌, మలినేని గోపీచంద్‌, బుచ్చిబాబు, నిర్మాతలు ఎ.ఎం. రత్నం, దిల్‌ రాజు, శిరీష్‌, విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిభోట్ల సాహు గారపాటి, రామ్‌ ఆచంట, గోపి ఆచంట, కిలారు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం దిల్‌ రాజు క్లాప్‌ కొట్టగా, ఎ.ఎం. రత్నం కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. అనంతరం ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తెల్లటి ఓవర్‌కోట్‌ ధరించి, హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌ పక్కనల, టీ గ్లాస్‌ పట్టుకుని నిల్చొని ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఇంటెన్స్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లో, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ రాకను సూచించే గాలిమర, టవర్‌ మరియు మెరుపులు కనిపిస్తున్నాయి. ‘ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు’ ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే క్యాప్షన్స్‌ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ మెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. అయానంక బోస్‌ సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరించనున్నారు.  ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఆనంద్‌ సాయి, ఛోటా కె కె.ప్రసాద్‌ ఎడిటర్‌గా పని చేయగా, దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.


Updated Date - 2022-12-11T18:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising