అశ్లీల వీడియోలు చూస్తుండగా.. మధ్యలో Popup notification.. ఓపెన్ చేసిన కాసేపటికి యువతి నుంచి ఫోన్.. చివరకు..
ABN, First Publish Date - 2022-07-16T00:03:07+05:30
నేటి స్మార్ట్‌ఫోన్ యుగంలో ప్రపంచం చాలా చిన్నదైపోయినా.. నేరాలు మాత్రం భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బ్యాంకులోని నగదు ఖాళీ చేసేస్తున్నారు. నేటి..
నేటి స్మార్ట్‌ఫోన్ యుగంలో ప్రపంచం చాలా చిన్నదైపోయినా.. నేరాలు మాత్రం భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బ్యాంకులోని నగదు ఖాళీ చేసేస్తున్నారు. నేటి సమాజంలో చాలా మంది యువకులు.. ఫోన్లలో అశ్లీల వీడియోలకు ఎడిక్ట్ అవుతున్నారు. ఇలాంటి వారిని ఓ ముఠా.. టార్గెట్‌గా చేసుకుని, కాసులు దండుకుంటోంది. చివరకు ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్‌లో మరో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టయింది. 18 మంది బాలురు, నలుగురు బాలికలు ముఠాగా ఏర్పడి.. ఉద్యోగ్ విహార్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మన దేశంతో పాటూ విదేశాలకు చెందిన వారిని టార్గెట్ చేసేవారు. అశ్లీల వీడియోలు చూస్తున్న వారికి.. మధ్యలో Popup notification పంపుతారు. మీ బ్యాంకు వివరాలు లీక్ అయ్యాయి. వాటిని భద్రంగా ఉంచాలంటే యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్(Software)ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.. అని సూచిస్తారు.
పది రోజులకో పెళ్లి.. ఒక్క నెలలోనే ముగ్గురితో వివాహం.. ఈ యువతి నిర్వాకం తెలిసి నివ్వెరపోతున్న భర్తలు..!
తర్వాత యువతులతో కాల్ చేయించి, చార్జీల పేరుతో 200 నుంచి 900 డాలర్ల వరకు తీసుకుంటారు. ఇలా చాలా మంది వద్ద నుంచి అధిక మొత్తంలో నగదును దోచుకున్నారు. సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. కాల్ సెంటర్ ఆపరేటర్‌తో సహా 22 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, రూ.13,480ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
వయసు మీద పడుతున్నా ఆ ఊళ్లోని అబ్బాయిలకు పెళ్లే కావడం లేదట.. అసలు సంబంధాలే రాకపోవడం వెనుక..!
Updated Date - 2022-07-16T00:03:07+05:30 IST