కవలలు కావడంతో భర్తను గుర్తుపట్టలేకపోయిన భార్య.. దీన్నే అవకాశంగా తీసుకున్న అన్న.. తమ్ముడు లేని సమయంలో..
ABN, First Publish Date - 2022-05-22T22:15:38+05:30
కొందరు కవలలు చూడ్డానికి అచ్చం ఒకేలా ఉంటారు. ఎంతలా అంటే కనీసం వారి తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేనంతగా ఉంటారు. ఇలాంటి కవలల విషయంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతూ..
కొందరు కవలలు చూడ్డానికి అచ్చం ఒకేలా ఉంటారు. ఎంతలా అంటే కనీసం వారి తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేనంతగా ఉంటారు. ఇలాంటి కవలల విషయంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇక పెళ్లయిన కవలలకు మరిన్ని సమస్యలు తలెత్తుతుంటాయి. కొత్తగా కాపురానికి వచ్చిన మహిళలు.. వారి భర్తను గుర్తుపట్టడం కష్టమవుతుంటుంది. మహారాష్ట్రలో ఇద్దరు కవలల విషయంలో ఇలాగే జరిగింది. తమ్ముడి భార్య తన భర్తను గుర్తుపట్టడంలో ఇబ్బంది పడేది. దీన్నే అన్న అవకాశంగా తీసుకున్నాడు. ఓ రోజు తమ్ముడు లేని సమయం చూసి అతడు చేసిన పని.. స్థానికంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది.
మహారాష్ట్ర లాతూర్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ఇద్దరు కవలలు అచ్చం ఒకేలా ఉంటారు. ఇద్దరిలో అన్న ఎవరో, తమ్ముడు ఎవరో స్థానికులతో పాటూ ఒక్కోసారి వారి తల్లిదండ్రులు కూడా కనుక్కోలేకపోయేవారు. ఈ క్రమంలో వారికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నాలు చేశారు. అయితే పెళ్లి చేసుకునేందుకు అన్న నిరాకరించడంతో తమ్ముడికి వివాహం చేశారు. కొత్తగా కాపురానికి వచ్చిన మహిళ.. తన భర్తను గుర్తుపట్టేందుకు చాలా ఇబ్బంది పడేది. దీన్ని గమనించిన అన్న.. తమ్ముడి భార్యపై కన్నేశాడు. ఓ రోజు తమ్ముడు లేని సమయంలో చూసి మరదలి గదిలోకి వెళ్లాడు. ఆమెకు కూడా అనుమానం రాకపోవడంతో తరచూ రాసలీలలు సాగించేవాడు.
తనను దూరం పెడుతోందనే కారణంతో ప్రేయసిని గోవా తీసుకెళ్లాడు.. బీచ్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం.. మరుసటి రోజు చూస్తే..
అయితే కొన్నాళ్లకు అతడు తను భర్త కాదని ఆమెకు అనుమానం వచ్చి నిలదీసింది. ఇదే విషయాన్ని తన భర్త, అత్తమామలకు కూడా తెలియజేసింది. పరువు పోతుందనే ఉద్దేశంతో వారు కూడా పెద్ద కొడుక్కే మద్దతు పలికారు. ఈ విషయంలో భర్త కూడా పట్టించుకోకపోవడం.. ఆమెను తీవ్రంగా కుంగదీసింది. చివరకు తన తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి భర్త, సోదరుడు, కుటుంబసభ్యులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రేమ పెళ్లి చేసుకుని 15 రోజులు కూడా కాకముందే ఓ యువకుడి బలవన్మరణం.. తండ్రికి చివరగా వాట్సప్‌లో పంపిన మెసేజ్‌లో..
Updated Date - 2022-05-22T22:15:38+05:30 IST