Prabhas: తమన్నాతో చదరంగం!

ABN, First Publish Date - 2022-11-04T17:36:05+05:30

ప్యాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ చదరంగం ఆడారు. అది కూడా తన బెస్ట్‌ ఫ్రెండ్‌ తమన్నాతో! అదేంటి వీరిద్దరూ వేర్వేరు చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉండగా చదరంగం ఆడేంత స్కోప్‌ ఎక్కడ దొరికింది అనుకుంటున్నారా?

Prabhas: తమన్నాతో చదరంగం!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ప్యాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ (Prabhas) చదరంగం ఆడారు. అది కూడా తన బెస్ట్‌ ఫ్రెండ్‌ తమన్నా(Tamannaah)తో! అదేంటి వీరిద్దరూ వేర్వేరు చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉండగా చదరంగం (playing chess)ఆడేంత స్కోప్‌ ఎక్కడ దొరికింది అనుకుంటున్నారా? అది ఇప్పుడు కాదులెండీ! ప్రభాస్‌, తమన్నా కలిసి ‘రెబల్‌’ చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వారిద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు. అయితే ఆ సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌ తమన్నాకు చెస్‌ నేర్పించారు. ఆ ఫొటో ఇప్పుడు బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’, సలార్‌, ప్రాజెక్ట్‌ కె, మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా బబ్లీ బౌన్సర్‌ చిత్రంతో ఆకట్టుకున్న తమన్నా కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్‌’లో కథానాయికగా నటిస్తోంది. మరోపక్క సత్యదేవ్‌ సరసన ఆమె నటించిన  ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలకు సిద్ధమవుతోంది. 


Updated Date - 2022-11-04T17:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising