విడాకుల కేసులో షాకింగ్ తీర్పు.. భర్తకు ప్రతీ నెలా రూ.25 వేలు భరణం చెల్లించాలంటూ భార్యకు ఆదేశాలు..!
ABN, First Publish Date - 2022-06-26T00:14:41+05:30
కొన్ని కుటుంబాల్లో పెళ్లయిన కొత్తలో సమస్యలు తలెత్తితే.. మరికొన్ని కుటుంబాల్లో పిల్లలు పుట్టిన తర్వాత.. దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతుంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా...
కొన్ని కుటుంబాల్లో పెళ్లయిన కొత్తలో సమస్యలు తలెత్తితే.. మరికొన్ని కుటుంబాల్లో పిల్లలు పుట్టిన తర్వాత.. దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతుంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 83ఏళ్ల వయసులో ఉన్న వృద్ధుడికి.. భార్య నుంచి వేధింపులు మొదలయ్యాయి. రోజురోజుకూ ఎక్కువవడంతో చివరకు కోర్టును ఆశ్రయించాడు. విచారించిన న్యాయస్థానం.. భర్తకు ప్రతి నెలా రూ.25వేలు చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని పూణేకు చెందిన అశోక్(83), లత(78)(పేర్లు మార్చాం)కు 1964లో వివాహమైంది. వారి ఇద్దరి కుమార్తెలకు కూడా వివాహం అయింది. అశోక్ విద్యా సంస్థను నిర్వహిస్తున్నాడు. అతడి భార్య అందులో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వీరి మధ్య లేటు వయసులో సమస్యలు వచ్చి పడ్డాయి. అశోక్ ప్రస్తుతం మధుమేహం, గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. భర్తను బాగా చూసుకోవాల్సింది పోయి.. అతన్ని రోజురోజుకూ నిర్లక్ష్యం చేసేది. చివరకు భర్తను ఇంటి నుంచి బయటికి వెళ్లగొట్టాలని కూడా ప్రయత్నించింది. గొడవలు ఎక్కవ అవడంతో 2019లో ఇద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
న్యాయం చేయండంటూ రెండు చేతులూ లేని బాలిక కాళ్లతో రాసిందో లేఖ.. నేరుగా ఇంటికే వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి..
ఈ కేసులో ఇటీవల న్యాయస్థానం సంచలన తీర్చు ఇచ్చింది. భర్తకు ప్రతి నెలా రూ.25వేలు చెల్లించాలంటూ తీర్చు వెలువరించింది. భర్తకు భార్య ఇంత పెద్ద మొత్తంలో భరణం ఇవ్వాలని ఆదేశించడం రాష్ట్రంలో ఇదే మొదటి కేసు అని న్యాయవాది తెలిపారు. భార్య సంపాదిస్తూ.. అదే క్రమంలో భర్తకు ఆదాయ వనరు లేకపోతే, గొడవలు జరిగిన క్రమంలో భర్త కూడా హిందూ వివాహ చట్టం ప్రకారం భరణం కోసం దావా వేయవచ్చని పేర్కొన్నాడు. బాధితుడు అశోక్ మాట్లాడుతూ.. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేని సమయంలో తాను బాగా చూసుకున్నానని, ఆరోగ్యం నయమయ్యాక తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
40 ఏళ్ల వయసులో ఇదేం పోయేకాలం.. 14 ఏళ్ల బాలిక తండ్రికి రూ.30 వేలు ఇచ్చిమరీ..
Updated Date - 2022-06-26T00:14:41+05:30 IST