ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుదైన మేలు జాతి గుర్రాన్ని రూ.23 లక్షలకు కొనుగోలు చేశాడు.. ఇంటికెళ్లి స్నానం చేయించి చూస్తే..

ABN, First Publish Date - 2022-04-25T00:04:18+05:30

పైపై మెరుగులు చూసి ఆశపడితే చివరికి నిరాశే మిగులుతుంది. ఇప్పడీ ప్రస్తావన ఎందుకొచ్చింటే. ఓ వ్యక్తి అరుదైన మేలు జాతి గుర్రాన్ని రూ.23లక్షలకు కొనుగోలు చేశాడు. దాంతో మేలు జాతి గుర్రాల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పైపై మెరుగులు చూసి ఆశపడితే చివరికి నిరాశే మిగులుతుంది. ఇప్పడీ ప్రస్తావన ఎందుకొచ్చింటే. ఓ వ్యక్తి అరుదైన మేలు జాతి గుర్రాన్ని రూ.23లక్షలకు కొనుగోలు చేశాడు. దాంతో మేలు జాతి గుర్రాల ఉత్పత్తికి సంబంధించిన స్టడ్ ఫాంలపై పెట్టుబడి పెట్టాలని భావించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ గుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించిన తర్వాత చూసి ఖంగుతిన్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాకు చెందిన రమేశ్ సింగ్ అనే వ్యక్త వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి గుర్రాల పెంపకంపై ఆసక్తి ఉండడంతో మేలు జాతి గుర్రాల కోసం అన్వేషించేవాడు. ఈ క్రమంలో అతడికి లెహర్ కలాన్ గ్రామానికి చెందిన లచ్రా ఖాన్ అనే వ్యక్తి, అతడి స్నేహితులు పరిచయమయ్యారు. తమకు తెలిసిన వారి వద్ద అరుదైన నల్ల మార్వాడీ గుర్రం ఉందని, రూ. 23లక్షలకు కొంటే.. రూ.5లక్షల లాభం ఉంటుందని చెప్పారు. దీంతో పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి నల్ల మార్వాడీ గుర్రాన్ని రూ.23లక్షలకు కొనుగోలు చేశాడు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించాడు. అయితే తీరా స్నానం ముగిశాక.. దాని మీద ఉన్న నలుపు రంగు మొత్తం పోయి లేత గోధుమ రంగు బయటపడింది. దీంతో రమేశ్ సింగ్ కంగుతిన్నాడు.

స్నేహితుడితో కలిసి అత్త ఇంటికి వెళ్లిన యువకుడు.. దుస్తులు మార్చుకుని బయటికి వచ్చాడు.. స్థానికులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా..


తనకు మేలు జాతి గుర్రం అని చెప్పి.. సాధారణ గుర్రాన్ని విక్రయించినట్లు గుర్తించాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. అరుదైన గుర్రం అని చెప్పడంతో మేలు జాతి గుర్రాల ఉత్పత్తికి సంబంధించిన స్టడ్ ఫాంలపై పెట్టుబడి పెట్టాలని అనుకున్నానని, కానీ ఇలా మోసపోతానని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పలువురిని ఇలాగే నమ్మించి నిందితులు  గుర్రాలను విక్రయించినట్లు పోలీసు విచారణలో తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది.

ప్రియుడి కోసం భర్తను దూరం పెట్టింది... నాకు చేసినట్లు మరెవరికీ చేయొద్దంటూ భార్యకు లేఖ రాసిన భర్త..

Updated Date - 2022-04-25T00:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising