Pushpa-2: రష్యాలోనూ అదే రోజున..
ABN, First Publish Date - 2022-12-04T17:31:55+05:30
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే! అల్లు అర్జున్-రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం రష్యాలో సందడి చేయడానికి సిద్ధమైంది.
అల్లు అర్జున్(Allu arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa 2)చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే! అల్లు అర్జున్-రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం రష్యాలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ నెల మూడో తేదిన నుంచి అక్కడ ప్రీమియర్స్ షురూ చేశారు. దీని కోసం అల్లు, అర్జున్, సుకుమార్, రష్మిక మందన్నా రష్యాలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రష్యా, మాస్కో ప్రాంతాల్లో సినిమాకు చక్కని స్పందన వస్తోందని చిత్ర బృందం చెబుతోంది. ‘పుష్ప’ సాధించిన విజయంతో పార్ట్-2పై (Pushpa 2 releasing in russia) అంచనాలు భారీగా పెరిగిపొయాయి. అలందుకు తగ్గట్టే దర్శకుడు ‘పుష్ప2’ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ‘పుష్ప ది రూల్’ ఇండియాలో ఏ రోజైతే విడుదలవుతుందో అదే రోజు రష్యాలోనూ విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారని నెట్టింట హల్‌చల్ చేస్తుంది. దీనిపై నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ‘‘పుష్ప-2’ ఇండియాలో ఏ రోజైతే విడుదలవుతుందో అదే రోజు రష్యాలోనూ విడుదల చేస్తాం. రష్యాతోపాటు పలు విదేశీ భాషల్లోనూ అనువాదం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మొదటి భాగంలో కీలక పాత్ర పోషించిన ఫహాద్ ఫాజిల్ సీక్వెల్‌లోనూ కొనసాగుతారు. కొందరు కొత్త ఆర్టిస్టులు కూడా ఉంటారు’’ అని తెలిపారు.
Updated Date - 2022-12-04T17:32:44+05:30 IST