ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యపై అలక.. 42 ఏళ్లుగా అన్నం తినడం మానేసిన భర్త..!

ABN, First Publish Date - 2022-12-10T14:16:36+05:30

భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు, అలకలు సహజం. ఒకరి మీద ఒకరు అలిగినా మహా అయితే వారం లేదా రెండు వారాలు బెట్టు చేస్తారు. తర్వాత ఇద్దరూ కలిసిపోయి సంసార నౌకను ముందుకు నడుపుతారు. అయితే ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి భార్య మీద అలిగి ఏకంగా 42 సంవత్సరాలుగా అన్నం జోలికి వెళ్లడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు, అలకలు సహజం. ఒకరి మీద ఒకరు అలిగినా మహా అయితే వారం లేదా రెండు వారాలు బెట్టు చేస్తారు. తర్వాత ఇద్దరూ కలిసిపోయి సంసార నౌకను ముందుకు నడుపుతారు. అయితే ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి భార్య మీద అలిగి ఏకంగా 42 సంవత్సరాలుగా అన్నం (Odisha man has not eaten rice for 42 years ) జోలికి వెళ్లడం లేదు. కేవలం టీ, అటుకులు తింటూ జీవనం సాగిస్తున్నాడు. అలాగని ఆమెతో మాట్లాడడం మానుకోలేదు. ఆమె చేతి వంట మాత్రం తినడం లేదంతే.

జైపూర్ జిల్లాలోని వికీపూర్ గ్రామానికి చెందిన రామచంద్ర (76) అనే వ్యక్తి 22 ఏళ్ల వయసులో ఉండగా సీత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 42 ఏళ్ల క్రితం ఒకరోజు రామచంద్ర కూలిపని చేసుకుని ఇంటికి వచ్చి భోజనం పెట్టమని భార్యను అడిగాడు. అయితే ఆమెకు ఆరోజు అనారోగ్యంగా ఉండడంతో వంట చేయలేదు. అదే విషయం భర్తకు చెప్పింది. భార్య పరిస్థితిని అర్థం చేసుకోని రామచంద్ర ఆమెతో వాగ్వాదానికి (Fight with wife) దిగాడు. ఆమెపై అలకపూనాడు. అప్పట్నుంచి అన్నం తినడం మానేశాడు. ఆకలి వేసినపుడు టీ లేదా అటుకులు తింటూ జీవనం సాగిస్తున్నాడు. భోజనం చేయాలని భార్యతో పాటు ఎంత మంది బతిమాలినా అతను మెట్టు దిగడం లేదు.

Updated Date - 2022-12-10T14:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising