RRR in Japan : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మానియా తగ్గేదేలే!

ABN, First Publish Date - 2022-11-27T19:46:50+05:30

అభిమాన హీరో తెరపై కనిపిస్తే అభిమానులు కాగితాలు విసిరి హల్‌చల్‌ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ జపాన్‌లో కనిపిస్తోంది. ఇదంతా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మానియాదే.

RRR in Japan : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మానియా తగ్గేదేలే!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభిమాన హీరో తెరపై కనిపిస్తే అభిమానులు కాగితాలు విసిరి హల్‌చల్‌ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ జపాన్‌లో (Rrr in japan)కనిపిస్తోంది. ఇదంతా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (Rrr Mania) మానియాదే. రామ్‌చరణ్‌(Ram charan), ఎన్టీఆర్‌(Jr ntr) కీలక పాత్రధారులుగా రాజమౌళి (S s Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం జపాన్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అక్కడి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అభిమానులు సినిమా వీక్షిస్తూ తెరపై కాగితాలు విసురుతూ.. డ్యాన్స్‌లు చేస్తూ థియేటర్లలో సందడి చేశారు.  ఆ  ఫొటోలను చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. జపాన్‌లో ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు ఆనందం వ్యక్తం చేశారు. ‘‘గాల్లోకి కాగితాలు ఎగరేస్తే స్ర్కీన్‌ కనిపించకూడదు’ అని అభిమాన హీరో సినిమా రిలీజైనప్పుడు ఫిల్మ్‌ లవర్స్‌ అనుకుంటారు. జపాన్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కు అలాంటి ప్రేమాభిమానాలు దక్కుతాయని ఎవరూ ఊహించి ఉండరు’ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ  ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. 


Updated Date - 2022-11-27T19:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising