ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుస్తులు కొని Google Pay ద్వారా డబ్బులు చెల్లించిన బాలిక.. మరుసటి రోజే ‘‘ఐ లవ్ యూ’’ అంటూ యువకుడి మెసేజ్.. చివరకు..

ABN, First Publish Date - 2022-07-02T00:41:36+05:30

దుస్తులు కొనడానికి వస్త్ర దుకాణానికి వెళ్లిన బాలిక.. చివరగా Google Pay ద్వారా డబ్బులు చెల్లించింది. అయితే ఇదే ఆమె పాలిట సమస్యగా మారింది. అందులో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుస్తులు కొనడానికి వస్త్ర దుకాణానికి వెళ్లిన బాలిక.. చివరగా Google Pay ద్వారా డబ్బులు చెల్లించింది. అయితే ఇదే ఆమె పాలిట సమస్యగా మారింది. అందులో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న యువకుడు ఆమెను ఇష్టపడ్డాడు. Google Pay హిస్టరీలో చూసి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. మరుసటి రోజే ‘‘ నువ్వంటే ఇష్టం.. నిన్ను ప్రేమిస్తున్నాను’’.. అంటూ మెసేజ్ చేశాడు. మొదట పట్టించుకోని బాలిక చివరకు అతని మాటలు నమ్మి ప్రేమించింది. వీరి ప్రేమ కథ చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..


రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లా ధోరిమన్న అనే ప్రాంతానికి చెందిన యువకుడు.. గత ఏడాది పూణేలోని ఓ వస్త్ర దుకాణలో సేల్స్‌మెన్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో పూణే పరిధిలోని బార్మర్ అనే ప్రాంతానికి చెందిన బాలిక.. దుస్తులు కొనేందుకు వస్త్ర దుకాణానికి వెల్లింది. అనంతరం డబ్బులను Google Pay ద్వారా చెల్లించి వెళ్లిపోయింది. అయితే ఆ యువకుడు మాత్రం బాలికతో ఎలాగైనా స్నేహం చేయాలని నిర్ణయించుకున్నాడు. Google Pay హిస్టరీలో ఆమె నంబర్ తీసుకుని, ‘‘నువ్వంటే ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’.. అని మెసేజ్ చేశాడు. అలా రోజూ మెసేజ్‌లు చేస్తుండడంతో బాలిక కూడా అతడిని నమ్మింది. దీంతో ఇద్దరూ రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో బాలిక అతన్ని ప్రేమించింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఇద్దరూ పూణేలో సహజీవనం చేశారు. మార్చి 31న ఇద్దరూ ఆలయలో నిశ్చితార్థం చేసుకున్నారు.

రండి మేడమ్! మేము లిఫ్ట్ ఇస్తాం.. అంటూ తల్లీకూతుళ్లను కారు ఎక్కించుకున్నారు.. కాస్త ముందుకు వెళ్లాగానే..


పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై మూడు నెలలుగా అఘాయిత్యాలనికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో వివిధ అవసరాల నిమిత్తం ప్రియురాలి నుంచి రూ.4నుంచి రూ.5లక్షల వరకూ తీసుకున్నాడు. పెళ్లి గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడతా అని చెప్పి.. మే1న బాలిక స్వగ్రామానికి వెళ్లాడు. అయితే తీరా అక్కడికి వెళ్లాక.. తన తల్లిదండ్రులు నా మీద చాలా కోపంగా ఉన్నారని చెప్పి సొంతూరుకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ప్రియురాలిని దూరం పెట్టాడు. ఈ క్రమంలో ప్రియుడి సోదరుడి వివాహం జూన్27న జరుగుతుందని తెలుసుకున్న బాలిక.. రాజస్థాన్ బయలుదేరింది. తీరా అక్కడికి వెళ్లాక.. తమ కుమారుడు ఇంట్లో లేడని, ఎక్కడికి వెళ్లాడో తెలీదని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆమె.. గురువారం పోలీసులను ఆశ్రయించింది. తాను ప్రస్తుతం మేజర్ అని, తన ప్రియుడు తనకు కావాలని విన్నవించుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భర్త చనిపోయిన నెల తర్వాత.. ఓ భార్య షాకింగ్ నిర్ణయం.. నా కూతుర్ని నువ్వే చూసుకో అంటూ లేఖలో తల్లికి రాసి మరీ..

Updated Date - 2022-07-02T00:41:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising