ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఒకటే ఏడుపు.. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా..

ABN, First Publish Date - 2022-05-15T19:50:38+05:30

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల పచ్చని కాపురంలో చిచ్చు మొదలవుతుంటుంది. దంపతులు చేసే తప్పుల కారణంగా ఒక్కోసారి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దూరమవుతూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల పచ్చని కాపురంలో చిచ్చు మొదలవుతుంటుంది.  దంపతులు చేసే తప్పుల కారణంగా ఒక్కోసారి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దూరమవుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో డబ్బు విషయంలో గొడవలు జరుగుతుండగా.. మరికొన్ని కుటుంబాల్లో వివాహేతర సంబంధాల కారణంగా సమస్యలు తలెత్తుతుంటాయి. బీహార్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. చలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఏడుస్తూ ఉంది. ఏమైందో అని స్థానికులంతా కంగారుగా వెళ్లి చూసేసరికి.. షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ పరిధి తుర్కాన్హా గ్రామానికి చెందిన కౌషర్ అలీకి సాథియా(22) అనే యువతితో 2020 జూన్‌లో వివాహమైంది. వీరికి ప్రస్తుతం 6నెలల చిన్నారి ఉంది. పెళ్లయిన కొత్తలో భార్యను బాగా చూసుకున్న కౌషర్.. రానురాను చిత్రహింసలు పెట్టేవాడు. ఇంటి నిర్మాణం కోసం రెండు లక్షల రూపాయలు తేవాలని భార్యను నిత్యం వేధించేవాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో రోజూ వివిధ సాకులు చూపి కొట్టేవాడు. ఈ క్రమంలో గత శనివారం మళ్లీ గొడవ జరిగింది. తల్లికి అనారోగ్యంగా ఉండడంతో చూసి వస్తానని సాథియా కోరింది. భార్యను పుట్టింటికి పంపకపోగా.. కౌషర్, అతడి కుటుంబ సభ్యులు కలిసి మళ్లీ దాడి చేశారు. తీవ్రగాయాలవడంతో సాథియా అక్కడికక్కడే మృతి చెందింది.

వదినపై ప్రేమతో భార్యను దూరం పెట్టాడు.. విషయం ఇంట్లో తెలియడంతో రోజూ గొడవలు.. ఓ రోజు అర్ధరాత్రి భార్య గదికి వెళ్లి..



తర్వాత సాథియా తల్లిదండ్రులకు ఫోన్ చేసిన కౌషర్.. ‘‘మీ కూతురిని మనువడు కొరికి చంపాడు’’..అని నమ్మించే ప్రయత్నం చేశాడు. తల్లి మృతదేహం పక్కనే ఉన్న 6నెలల చిన్నారి ఏడుస్తూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. లోపలికి వెళ్లి చూడగా సాథియా చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. భర్త చేసిన తప్పు కారణంగా అనాథగా మారిన చిన్నారిని చూసి.. స్థానికులంతా అయ్యో పాపం.. అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పెళ్లైన మూడో రోజే ఇంట్లోంచి ఎస్కేప్.. మర్నాడే భార్య వీడియో కాల్ చేసి..

Updated Date - 2022-05-15T19:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising