ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tricycle కాదు.. అంతకు మించి Sonu Sood సాయం.. ఒంటి కాలిపై గెంతుతూ స్కూలుకు వెళ్తున్న పాపను చూసి..

ABN, First Publish Date - 2022-05-25T23:37:46+05:30

టీచర్ కావాలనేది ఆ పదేళ్ల చిన్నారి కోరిక.. తండ్రి ఊరికి దూరంగా కూలి పని చేస్తుండగా.. తల్లి ఇటుకల బట్టీలో దినసరి కూలి. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఎలాగైనా బాగా చదివి.. టీచర్ ఉద్యోగం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీచర్ కావాలనేది ఆ పదేళ్ల చిన్నారి కోరిక.. తండ్రి ఊరికి దూరంగా కూలి పని చేస్తుండగా.. తల్లి ఇటుకల బట్టీలో దినసరి కూలి. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఎలాగైనా బాగా చదివి.. టీచర్ ఉద్యోగం సాధించి, అందరికీ చదువు చెప్పాలనేది బాలిక ఆశయం. అయితే విధి ఆమెపై పగబట్టింది.. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆమె ఒక కాలు పోగొట్టుకుంది. దీంతో అంతా అయ్యో పాపం..! అని అంతా జాలి చూపించారు.


నా జీవితం ఇంతే అని సరిపెట్టుకోకుండా.. తన ఆశయ సాధన కోసం మళ్లీ అడుగు ముందుకు వేసింది. ఉన్న ఒక్క కాలితోనే కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూలుకు గెంతుతూ వెళ్లడం ప్రారంభించింది. బీహార్‌ ఫతేపూర్‌కు సమీపంలోని ఖైరా గ్రామానికి చెందిన సీమ కన్నీటి గాథ గురించి అందరికీ తెలిసిందే. ఒంటి కాలిపై గెంతుతూ స్కూల్‌కు వెళ్తున్న బాలిక వీడియో వైరల్ అవుడంతో నెటిజన్లు చిన్నారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వీడియో చూసిన Sonu Sood కూడా చలించిపోయారు. ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

బాలిక సంకల్పానికి హ్యాట్సాఫ్.. ఒంటికాలితో గెంతుకుంటూ రోజూ పాఠశాలకు.. టీచర్ అవ్వాలని కోరిక..!


కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడంలో సోనూ సూద్ ముందుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం సీమ కన్నీటి గాథ గురించి తెలుసుకున్న ఆయన.. ‘‘ఇప్పుడు ఆమె రెండు కాళ్లతో నడిచే సమయం వచ్చింది’’ అని ప్రస్తావిస్తూ ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. బాలికకు కృత్రిమ కాలు అమర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే బీహార్ రాష్ట్ర భవన నిర్మాణ మంత్రి అశోక్ చౌదరి కూడా బాలికకు సాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. సీమకు మహావీర్ చౌదరి ట్రస్ట్ ద్వారా సరైన చికిత్స చేయించనున్నట్లు ప్రకటించారు.

20 అడుగుల లోతైన డ్రైనేజీ గుంటలో పడిపోయిన చిన్నారి.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా దూకేసిన తల్లి..!



Updated Date - 2022-05-25T23:37:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising