spotted pardalote: కూత మార్చి మాయ చేస్తుంది..!
ABN, First Publish Date - 2022-12-12T10:17:47+05:30
గూడు కట్టే సమయంలో ఒంటరిగా ఉంటాయి,
మచ్చల పర్డలోట్ (Pardalotus quadragintus) అంతరించిపోతున్న జాతి. ఇది ప్రధానంగా టాస్మానియా (Bruny Island) అడవులలో గమ్ యూకలిప్టస్ విమినాలిస్ చెట్లలో (White gum) గూడు కట్టుకుని కనిపిస్తుంది. ఈ జాతి పక్షులు చిన్న తోక, Scoop-shaped bill లతో కనిపించే చిన్న పక్షి. ఈ పక్షులు ఆస్ట్రేలియాకు చెందిన అరుదైన పక్షులలో ఒకటి, ఎందుకంటే ఇవి ఆస్ట్రేలియాకు మాత్రమే చెందినవి. మచ్చల పర్డలోట్ (పర్డలోటస్ క్వాడ్రాగింటస్), రెక్కలు నల్లగా ఉంటాయి. ఈకలపై తెల్లటి మచ్చలు ఉంటాయి. ఈ విభిన్న రంగుల పక్షిని 'డైమండ్ పక్షి' అని పేరు పెట్టారు. ఇవి గూడు కట్టే సమయంలో ఒంటరిగా ఉంటాయి, సంతానోత్పత్తి కాలం తర్వాత వలస వెళతాయి.
పార్డలోట్‌లు ఎలా ఉంటాయి?
పార్డలోట్ పక్షులు రంగు రంగుల చిన్న పక్షులు. ఇవి పసుపు మచ్చలతో చూసేందుకు ముద్దుగా ఉంటాయి. ఈ పక్షులు వాటి మృదువైన ఈకలు సొగసైన రంగులతో ఎల్లప్పుడూ అందంగా కనిపిస్తాయి. పార్డలోట్‌లు తరచుగా ఒకదానితో ఒకటి బిగ్గరగా 'tchip tchip'అనే పిలుపులతో సంభాషించుకుంటాయి. ఈ పక్షులు పర్యావరణంలోని మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవ జాతులలో ఒకటిగా చేర్చబడ్డాయి.
1. పార్డలోట్ పక్షి 3.3-4.7 in (8.5-12 cm) పొడవు, 3.5 in (9 cm) పొడవు ఉంటుంది.
2. పార్డలోట్ పక్షులు వేగంగా ఎగురుతాయి.
3. పార్డలోట్ పక్షులు గరిష్టంగా 0.4 oz (12 గ్రా) బరువుతో ఉంటాయి.
4. స్ట్రైటెడ్ పార్డలోట్ డైట్‌లో ఆకులపై కీటకాలు, చిన్న కందిరీగలు, తోట సాలెపురుగులు, బోల్ వీవిల్స్, చెదపురుగులు వంటి అకశేరుకాలు తింటాయి.
5. కీటకాల లార్వాలను కూడా తింటాయి. తినే సమయంలో, ఈ పక్షులు చిన్న సమూహాలలో కనిపిస్తాయి.
6. సంతానోత్పత్తి కాలంలో, జూన్ నుండి జనవరి వరకు, స్ట్రైటెడ్ పార్డలోట్ పక్షి తన స్వరాన్ని మారుస్తుంది.
Updated Date - 2022-12-12T10:19:20+05:30 IST