ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kaikala - Subhash ghai: అంతమంది కలిస్తే... కైకాల ఒక్కరే!

ABN, First Publish Date - 2022-12-23T12:24:05+05:30

నవరసాలను పండించే నటుడు, గంభీరమైన గొంతు, హాస్యభరితమైన హావభావాలతో మెప్పించిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మరణంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యముడు, ఘటోత్కచుడు వంటి పాత్రలతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవరసాలను (Navarasa Natana sarvabhouma) పండించే నటుడు, గంభీరమైన గొంతు, హాస్యభరితమైన హావభావాలతో మెప్పించిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala satyanarayana) మరణంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యముడు(Kaikala as yamudu), ఘటోత్కచుడు వంటి పాత్రలతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు. పదుల సంఖ్యలో యముడి పాత్రలతో భళా అనిపించారు. ‘యముండ’ అనే ఆయన గర్జన ఎప్పటికీ మరువలేని. అలాంటిదే ఘటోత్కచుడు పాత్ర కూడా! విలక్షణ నటుడి మరణాన్ని టాలీవుడ్‌ జీర్ణించుకోలేకపోతుంది. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు (Rip Kaikala satyanarayana) అర్పిస్తున్నారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

కైకాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...

ఎన్టీఆర్‌తో 101 చిత్రాలు

ఎన్టీఆర్‌ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’ చిత్రంలో ఆయనకు డూప్‌గా నటించిన సత్యనారాయణ ఆ తర్వాత కాలంలో ఆయనతో కలసి 101 చిత్రాల్లో నటించడం విశేషం. ఇందులో సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక సినిమాలు ఉన్నాయి. సత్యనారాయణను సొంత తమ్ముడిగా భావించి ఎన్టీఆర్‌ ఎంతో ఎంకరేజ్‌ చేసేవారు. ఆయన పోలికలు తనలో కొన్ని ఉండడం సత్యనారాయణ అదృష్టంగా భావించేవారు. ‘అన్నయ్యా’ అంటూ వినయవిధేయతలతో మెలిగేవారు. ఎన్టీఆర్‌కు దీటైన విలన్‌గా చాలా చిత్రాల్లో సత్యనారాయణ రాణించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’.

అంతమంది కలిస్తే కైకాల ఒక్కరే!

నటుడిగా సత్యనారాయణ ఎంత గొప్పవారో చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఒకసారి బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత సుభాష్‌ఘాయ్‌ సత్యనారాయణను రచయిత కమలేష్‌ పాండేకు పరిచయం చేస్తూ ‘అశోక్‌కుమార్‌, అమ్రేష్‌పురి, అంజాద్‌ఖాన్‌, ప్రాణ్‌, ప్రేమ్‌నాథ్‌, సంజీవ్‌కుమార్‌, షమ్మీకపూర్‌.. వీరందరూ కలసి ఒకే నటుడిగా రూపొందితే ఈయనవుతారు’ అన్నారు. కైకాలకు అందిన గొప్ప కాంప్లిమెంట్‌ ఇది.

ఎస్వీఆర్‌ అభినందన

సత్యనారాయణ అంటే ఎస్వీ రంగారావుకు మొదటి నుంచీ అభిమానం. ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలో తను చేయాల్సిన దుర్యోధనుడి వేషాన్ని సత్యనారాయణ చేశాడని మనసులో పెట్టుకోకుండా , ‘బాగా చేశావు’ అని చెప్పి మెచ్చుకోవడం ఎస్వీఆర్‌ గొప్పతనానికి నిదర్శనం. అలాగే ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో సత్యనారాయణ చేసి కామెడీ నటన ఆయనకు బాగా నచ్చేసింది. రాత్రి ప్రివ్యూ చూసిన ఆయన తెల్లారగానే సత్యనారాయణ విక్రమ్‌ స్టూడియోలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి వ్యక్తిగతంగా అభినందించి వచ్చారు.

గంటల లెక్కన పనిచేశారు

హాస్యనటుడు పద్మనాభం దర్శకత్వం వహించిన ‘శ్రీరామ కథ’ చిత్రంలో తొలిసారిగా రావణాసురుడి పాత్ర పోషించారు సత్యనారాయణ. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో పింజల సుబ్బారావు నిర్మించే ‘సీతాకల్యాణం’ సినిమాలో మరోసారి ఆ పాత్రను పూర్తిస్థాయిలో పోషించే అవకాశం ఆయనకు వచ్చింది. ‘శ్రీకృష్ణావతారం’లో ఆయన పోషించిన దుర్యోధనుడి వేషం చూసి ఈ పాత్ర ఆఫర్‌ చేశారు దర్శకుడు బాపు. అయితే ఆ సమయంలో చాలా సినిమాల్లో నటిస్తుండడంతో వీలు పడదేమో అని బాపుతో అన్నారు కైకాల. అయినా ఆయన వదల్లేదు. ‘ఈ పాత్ర మీరు తప్ప మరెవరూ చేయలేరు. రోజుకి ఒక గంట చొప్పున మాకు ఇస్తే చాలు’ అని ఒత్తిడి చేసి ఒప్పించారు. అంత తక్కువ వ్యవధిలో కూడా ఎక్కడా రాజీపడకుండా రావణాసురుడి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు బాపు. ‘సీతాకల్యాణం’ ఆర్ధికంగా విజయం సాధించలేదు కానీ దేశ, విదేశాల్లో క్లాసిక్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘సీతారామ వనవాసం’ చిత్రంలో మరోసారి రావణాసురుడి పాత్ర పోషించారు కైకాల.

ఆ రెండింటిలో నటించిన ఘనత...

ఎన్టీఆర్‌ ‘దానవీరశూర కర్ణ’, కృష్ణ ‘కురుక్షేత్రం’ చిత్రాలు ఒకే సమయంలో పోటాపోటీగా తయారవుతున్న తరుణం అది. ఈ రెండు చిత్రాల వల్ల తెలుగు చిత్రపరిశ్రమ రెండుగా చీలిపోయింది. ఆ చిత్రంలో నటించిన వారు ఈ చిత్రంలో నటించకూడదనే నిబంధనను ఇరువర్గాలు కఠినంగా అమలు చేస్తున్న సమయంలో రెండు చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించిన ఘనత సత్యనారాయణకే దక్కింది. ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో భీముడి వేషం సత్యనారాయణకు ఆఫర్‌ చేసి, అవతలి చిత్రంలో నటించకూడదని చెప్పారు ఎన్టీఆర్‌. అప్పటికే ‘కురుక్షేత్రం’లో దుర్యోదనుడి పాత్రను వేయమని హీరో కృష్ణ అడిగినట్లు సత్యనారాయణ చెప్పారు. ‘ఆ చిత్రంలో నటించడకూడదని చెబుతున్నానుగా’ అని ఎన్టీఆర్‌ కొంచెం కోపంగా అన్నారు. ‘దుర్యోధనుడి పాత్ర పోషించాలనే కోరిక నాకు ఉంది. పోనీ మన చిత్రంలో ఆ పాత్ర నాకు ఇవ్వండి’ అని అడిగారు సత్యనారాయణ. ‘మన సినిమాలో దుర్యోధనుడి పాత్రను స్పెషల్‌గా డిజైన్‌ చేస్తున్నాం. ఒక పాట కూడా పెట్టాం. ఆ పాత్ర నీకు సూట్‌ కాదు. నేనే పోషించాలి’ అన్నారు ఎన్టీఆర్‌. ‘నాకు కూడా దుర్యోధనుడి పాత్ర పోషించాలనే కోరిక ఉంటుంది కదా అన్నయ్యా’ అని మళ్లీ సత్యనారాయణ అనడంతో ‘సరే. రెండూ చేసుకో’ అని అనుమతి ఇచ్చారు ఎన్టీఆర్‌. ‘దానవీరశూర కర్ణ’ షూటింగ్‌ హైదరాబాద్‌లో, ‘కురుక్షేత్రం’ షూటింగ్‌ చెన్నైలో జరిగేవి. ఆ రెండు చిత్రాల్లో నటించినంత కాలం అటు ఇటు ప్రయాణాలు చేస్తుండేవారు సత్యనారాయణ.

Updated Date - 2022-12-23T12:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising