Super Star Krishna: కొడుకుకి ఫ్రెండ్… ఫిలాసఫర్… గైడ్!
ABN, First Publish Date - 2022-11-15T19:54:54+05:30
సినిమాల విషయంలో మహేష్ బాబు సక్సెస్ గ్రాఫ్‌లో ఎటువంటి ఎగుడుదిగుళ్లూ లేకపోవడానికి ముఖ్యకారణం తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సలహాలే అని తెలిసిందే.
సినిమాల విషయంలో మహేష్ బాబు సక్సెస్ గ్రాఫ్‌లో ఎటువంటి ఎగుడుదిగుళ్లూ లేకపోవడానికి ముఖ్యకారణం తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సలహాలే అని తెలిసిందే. ఈ విషయాన్ని మహేష్ తరచూ చెబుతుంటారు. ఏ కథ బాగుంది, ఏ సబ్జెక్ట్ మహేష్‌కి నప్పదు, ఏ సినిమా హిట్టవుతుంది, ఎంత హిట్టవుతుంది... వగైరా వివరాలన్నీ కృష్ణకి కొట్టినపిండి. కాబట్టి, వాటికి అనుగుణంగా మహేష్‌ను ఆయన గైడ్ చేస్తుంటారు. కాల్షీట్స్, కాస్ట్యూమ్స్, షెడ్యూల్స్ గురించి అర్ధాంగి నమ్రత చూసుకుంటే, సినిమాల ఎంపిక విషయంలో కృష్ణ అపారమైన అనుభవం మహేష్‌కి తోడవుతుండేది.
సినిమాల విషయంలోనే కాదు, జీవితానికి సంబంధించి, క్రమశిక్షణకు సంబంధించి కూడా చాలా సున్నితంగా సూచనలు ఇస్తారట కృష్ణ. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మహేష్.
పదేళ్ల క్రితం వరకూ సిగిరెట్లు విపరీతంగా కాల్చేవాడట మహేష్. కూడదని తెలిసినా, ఆ బలహీనత నుంచి తప్పించుకోలేకపోయాడట. అటువంటి రోజుల్లో కృష్ణ ఒక పుస్తకాన్ని ప్రెజెంట్ చేశారట చదవమని. ఆ పుస్తకం: బ్రిటీష్ రచయిత Allen Carr రాసిన "The Easy Way to Stop Smoking". 30 ఏళ్ల పాటు కొనసాగిన తన చెయిన్ స్మోకింగ్ అలవాటుని తాను ఎలా మానేశాడో వివరిస్తూ అలెన్ కార్ ఆ పుస్తకం రాశాడని చెప్పారట కృష్ణ. ఆ పుస్తకం, దానికి మించి సున్నితంగా తండ్రి ఇచ్చిన సలహా తనని మార్చేశాయంటారు మహేష్.
Updated Date - 2022-11-15T22:13:15+05:30 IST