ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పటిదాకా ఆడుకుంటున్న బాలిక.. ఆ మరుక్షణమే అపస్మారక స్థితిలో.. నోటికి ఖర్చీప్ అడ్డుపెట్టి మరీ చివరకు..

ABN, First Publish Date - 2022-08-24T22:21:27+05:30

బాలికలపై నిత్యం ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఒంటరిగా కనిపించే బాలికలు, యువతులు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలికలపై నిత్యం ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఒంటరిగా కనిపించే బాలికలు, యువతులు, మహిళలే (women) టార్గెట్‌గా కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రేమించమంటూ వేధించేవారు కొందరైతే.. ఇంకొందరు ప్రేమ పేరుతో మోసం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‪‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా అడుకుంటున్న బాలిక.. కాసేపటికే అపస్మారక స్థితిలోకి (unconsciousness) వెళ్లింది. నోటికి ఖర్పీప్ అడ్డుపెట్టి చివరకు నిందితులు చేసిన పని.. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం మొరాదాబాద్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 11ఏళ్ల బాలిక.. ఆరో తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో ఇంటి ఆరుబయట ఆడుకుంటూ ఉంది. ఆమెను గమనించిన షమీ, మరో వ్యక్తి.. పాడు చేయాలని కుట్ర పన్నారు. ఖర్చీప్‌లో మత్తుపదార్థాలను నింపుకొని.. సడన్‌గా బాలిక మొఖంపై పెట్టారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం జన సంచారం లేని ప్రాంతంలోకి తీసుకెళ్లి.. అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 

Shocking scene: కారులో వెళ్తున్న మహిళా కానిస్టేబుల్.. పొదల్లోంచి అలికిడి రావడంతో.. దగ్గరికి వెళ్లి చూడగా..


బాలికను గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బాలికను విచారించి కేసు నమోదు చేశారు. నిందితుడు షమీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతను స్థానికంగా దుస్తులు విక్రయిస్తుంటాడని తెలిసింది. మరో వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి ఉండడంతో బాలిక గుర్తించలేకపోయింది. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Wife's shocking plan: నా భర్తను చంపేశారా! అంటూ కిల్లర్లకు భార్య ఫోన్.. చంపేంత ధైర్యం లేక.. చివరకు భర్తతో కలిసి వారు ఆడిన డ్రామాతో..



Updated Date - 2022-08-24T22:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising