ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్ రిపోర్ట్.. లాక్‌డౌన్‌లో ఎన్ని వేల మందికి HIV సోకిందో బయటపెట్టిన AIDS నియంత్రణ సంస్థ

ABN, First Publish Date - 2022-04-28T17:49:55+05:30

హెచ్ఐవీ.. ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న అనేక వైరస్‌లలో ఇదీ ఒకటి. అయితే ఈ వ్యాధి అంత ప్రమాదకరం కాకపోయినా.. ఒక్కసారి సోకిందంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెచ్ఐవీ.. ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న అనేక వైరస్‌లలో ఇదీ ఒకటి. అయితే ఈ వ్యాధి అంత ప్రమాదకరం కాకపోయినా.. ఒక్కసారి సోకిందంటే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితిని కల్పిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రోగ నిరోధక శక్తిని దెబ్బతీసి, శరీరాన్ని అనేక రోగాలకు నిలయంగా మార్చి, చివరకు మనిషి ప్రాణాలను సైతం హరిస్తుంది. ప్రధానంగా సురక్షితం కాని శృంగారం వల్ల ఈ వ్యాధి సోకుతుందనే విషయం తెలిసిందే. తాజాగా AIDS నియంత్రణ సంస్థ కొన్ని షాకింగ్ వివరాలను బయటపెట్టింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో దేశ వ్యాప్తంగా హెచ్ఐవీ బాధితుల సంఖ్య ప్రకారం.. ఏపీ రెండో స్థానంలో ఉండడం.. ఆందోళన కలిగించే విషయం..


కొవిడ్ కారణంగా 2020 నుంచి 2021 మధ్య దేశంలో లాక్‌డౌన్ విధించడం వల్ల ప్రజలు వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా,  ఈ సమయంలో దేశంలో హెచ్ఐవీ కేసులు ఎన్ని నమోదయ్యాయనే విషయంపై వివరాలు బయటపెట్టాలని మధ్యప్రదేశ్‌కి చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీంతో AIDS నియంత్రణ సంస్థ వివరాలు బయటపెట్టింది. దేశంలో 2020, 2021 మధ్యలో మహారాష్ట్రలో సురక్షితం కాని శృంగారం కారణంగా 10,498 మంది హెచ్ఐవీ బారిన పడ్డారు.

ఫొటోను చూసే అవాక్కవుతున్నారా..? ఈ King Cobra వీడియోను చూస్తే..


అలాగే 9,521 మంది బాధితులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక కర్ణాటకలో 8,947 మందికి హెచ్ఐవీ సోకిందని తెలిసింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, ‌పశ్చిమ బెంగాల్‌.. వరుసగా 3,037, 2,757 మంది హెచ్ఐవీ బాధితులతో నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నాయి. అయితే 2011 నుంచి 2021వరకు పరిశీలిస్తే కేసుల సంఖ్య క్షీణిస్తూ వచ్చిందని AIDS నియంత్రణ సంస్థ తెలిపింది. 2011, 12 సంవత్సరాల్లో 2.4 లక్షల మంది బాధితులు ఉండగా.. 2019, 2020లో 1.44 లక్షలకు తగ్గింది. అలాగే 2021లో దేశ వ్యాప్తంగా 85,268 కేసులు బయటపడ్డాయి.

అరుదైన మేలు జాతి గుర్రాన్ని రూ.23 లక్షలకు కొనుగోలు చేశాడు.. ఇంటికెళ్లి స్నానం చేయించి చూస్తే..

Updated Date - 2022-04-28T17:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising