ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షేవింగ్ పూర్తిగా చేశాక డబ్బులు ఇస్తానన్న కస్టమర్.. లేదు ఇప్పుడే ఇవ్వాలన్న బార్బర్.. చివరకు పని మధ్యలో ఆపేసి..

ABN, First Publish Date - 2022-09-18T03:32:31+05:30

చిన్న చిన్న గొడవలకే కొందరు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటారు. ఇంకొందరు మనసులో కక్ష పెట్టుకుని.. కావాలని గొడవ చేసి, చివరకు దారుణాలకు తెగబడుతుంటారు...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న చిన్న గొడవలకే కొందరు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటారు. ఇంకొందరు మనసులో కక్ష పెట్టుకుని.. కావాలని గొడవ చేసి, చివరకు దారుణాలకు తెగబడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. దీనివల్ల ఇంటి పెద్దను కోల్పోయి.. చివరకు కుటుంబాలు రోడ్డున పడుతుంటాయి. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. షేవింగ్ చేస్తుండగా.. కస్టమర్‌కు, బార్బర్‌కు మధ్య గొడవ జరిగింది. షేవింగ్ పూర్తిగా చేశాక డబ్బులు ఇస్తానని కస్టమర్ చెప్పడంతో బార్బర్ సీరియస్ అవడంతో పాటూ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చివరకు బార్బర్ కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్ జిల్లా బోధి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అనిల్ షిండే (32) అనే వ్యక్తి సెలూన్ షాపు (Salon shop) నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ (22).. గురువారం సాయంత్రం షేవింగ్ చేయించుకునేందుకు వెళ్లాడు. షేవింగ్ సగం పూర్తయ్యాక.. తనకు డబ్బులు ఇవ్వాలని అనిల్ షిండే అడిగాడు. షేవింగ్ పూర్తయ్యాక డబ్బులు ఇస్తానని వెంకటేశ్ అన్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అనిల్ షిండే.. కత్తితో వెంకటేశ్ గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో వెంకటేశ్.. అక్కడికక్కడే మృతి చెందాడు.

భార్యకు పిల్లలు పుట్టలేదనే కారణంతో ఎదురింటి మహిళను చంపిన భర్త.. అందుకే ఇలా చేశానంటూ ఆ వ్యక్తి చెప్పింది విని..


ఈ విషయం మృతుడి కుటుంబ సభ్యులకు తెలియడంతో పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహంతో సెలూన్‌పై దాడి చేశారు. పెట్రోల్ పోసి సెలూన్‌కు నిప్పంటించి, అనంతరం అనిల్ షిండేని పట్టుకుని చితకబాదారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన అనిల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  అనిల్, వెంటకేశ్ తరపు బంధువుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

యువతిని కొట్టి, దుస్తులు ఊడదీసి మరీ వీడియో తీసిన యువకులు.. చివరకు జేసీబీలతో వెళ్లిన అధికారులు..



Updated Date - 2022-09-18T03:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising