రాత్రి 10.30 గంటల సమయం.. రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ చివర ఓ ప్రేమజంట.. కానిస్టేబుల్ చూసి నిలదీస్తే..
ABN, First Publish Date - 2022-04-22T18:51:08+05:30
కొన్ని ప్రేమ జంటలు ఒక్కోసారి హద్దు మీరి ప్రవర్తిస్తుంటాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్న స్పృహ కూడా ఉండదు. కొందరైతే బహిరంగ ప్రదేశాల్లోనే రాసలీలలు...
కొన్ని ప్రేమ జంటలు ఒక్కోసారి హద్దు మీరి ప్రవర్తిస్తుంటాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్న స్పృహ కూడా ఉండదు. కొందరైతే బహిరంగ ప్రదేశాల్లోనే రాసలీలలు సాగిస్తుంటారు. ఇక పార్కుల్లో కొన్ని ప్రేజ జంటల తీరు.. చూసేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమికులు.. రాత్రి 10.30గంటల సమయంలో ఏకంగా రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్ మీదే రాసలీలలు సాగించారు. వీరి ప్రవర్తనను గమనించిన ఓ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి నిలదీశాడు. తర్వాత అక్కడ జరిగిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది..
ముంబయిలోని వసాయ్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి 10.30గంటల సమయంలో స్టేషన్ ఫ్లాట్‌ఫామ్.. ప్రయాణికులతో రద్దీగా ఉంది. అదే సమయంలో అక్కడున్న ఓ ప్రేమ జంట ప్రవర్తనను గమనించిన ప్రయాణికులు అవాక్కయ్యారు. అందరి ముందే ప్రియుడు తన ప్రియురాలిని ముద్దు పెట్టుకోవడం, అసభ్యకరంగా ప్రవర్తించడం చూసి అంతా ఛీదరించుకున్నారు. కానీ వారిని వారించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ ఇదంతా గమనించాడు. వారి వద్దకు వెళ్లి.. బహిరంగ ప్రదేశంలో ఏంటిది.. అంటూ నిలదీశాడు. దీంతో ప్రియుడు ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు.
ఉద్యోగరీత్యా వేరు వేరు సిటీల్లో దంపతులు.. భార్య నివసిస్తున్న ఇంటి ఓనర్ భర్తకు ఫోన్ చేసి..
నన్నే ప్రశ్నిస్తావా.. అని దుర్భాషలాడుతూ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా అతడి ముఖంపై ఉమ్మి వేసి దాడి చేశాడు. స్థానికులు కలగజేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. తర్వాత కానిస్టేబుల్ తన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు నలసోపరా ప్రాంతానికి చెందిన కుల్దీప్ తివారీగా గుర్తించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిపై దాడి చేయడం, బెదిరించడం తదితర సెక్షన్ల కింద నిందితుడిపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కూతుర్ని బస్సు ఎక్కించి వచ్చిన తండ్రి.. ఇంట్లో నగ్నంగా వంట చేస్తున్న గుర్తు తెలియని మహిళను చూసి షాక్.. చివరకు..
Updated Date - 2022-04-22T18:51:08+05:30 IST