ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి చేసుకోకపోగా.. అబార్షన్ చేయించాలని చూశాడు.. బిడ్డను చంపుకోవడం ఇష్టం లేదని ఆమె అనడంతో..

ABN, First Publish Date - 2022-07-04T03:16:00+05:30

ప్రేమ పేరుతో యువతులకు దగ్గరయ్యే క్రమంలో చాలా మంది.. చివరికి మోసం చేయడమే పనిగా పెట్టుకుంటుంటారు. మోసపోయామని తెలుసుకున్న కొందరు మహిళలు.. చివరకు ఆత్మహత్యలకు...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ పేరుతో యువతులకు దగ్గరయ్యే క్రమంలో చాలా మంది.. చివరికి మోసం చేయడమే పనిగా పెట్టుకుంటుంటారు. మోసపోయామని తెలుసుకున్న కొందరు మహిళలు.. చివరకు ఆత్మహత్యలకు పాల్పడడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇంకొన్ని ఘటనల్లో ఎదురుతిరిగిన యువతులపై దాడులు చేయడం కూడా జరుగుతుంటుంది. ఇటీవల యూపీలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రేమ పేరుతో దగ్గరై.. పెళ్లి చేసుకోకపోగా, అబార్షన్ చేయించాలని చూశాడు. బిడ్డను చంపుకోవడం ఇష్టం లేదని ప్రియురాలు అనడంతో చివరకు దారుణానికి పాల్పడ్డాడు.


యూపీలోని ఫతేపూర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాహుల్ గుప్తా అనే వ్యక్తికి.. అదే గ్రామానికి చెందిన సరస్వతి దేవితో పరిచయం ఏర్పడింది. సుమారు ఏడాది పాటు ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఈ క్రమంలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల ఆమె గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని అడగడంతో చివరకు మాట మార్చాడు. పైగా అబార్షన్ చేయించాలని చూడడంతో ఆమె ఒప్పుకోలేదు. బిడ్డను చంపుకోవడం ఇష్టం లేదు.. నన్ను పెళ్లి చేసుకో.. అంటూ నిలదీసింది. 

భర్తే కదా అని.. అతడి ముందే దుస్తులు మార్చుకున్న భార్య.. అయితే ఆమెకు తెలీదు.. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయని.. చివరకు..


దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాహుల్.. ఆమెపై  కత్తితో  దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

స్కూటీని తోసుకుంటూ వెళ్తున్న బాలికలను చూసి.. పెట్రోల్ తీసుకొద్దామంటూ ఒకరిని బైక్‌పై ఎక్కించుకున్నాడు.. చివరకు పర్సు మర్చిపోయానంటూ..

Updated Date - 2022-07-04T03:16:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising