పెళ్లయిన మరుసటి రోజే నవ వధువు షాకింగ్ నిర్ణయం.. భర్తకు విడాకులు.. ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ..
ABN, First Publish Date - 2022-05-17T18:23:31+05:30
చాలామంది ప్రేమికులు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. చావడానికైనా సిద్ధపడతారు గానీ.. తమ ప్రేమను మాత్రం వదులుకోరు. కొందరు ప్రేమికులు...
చాలామంది ప్రేమికులు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. చావడానికైనా సిద్ధపడతారు గానీ.. తమ ప్రేమను మాత్రం వదులుకోరు. కొందరు ప్రేమికులు పెద్దలను ఎదిరించి... పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. మరికొందరు పెద్దలను ఎదిరించలేక.. మరోవైపు ప్రేమను వదులుకోలేక, చివరకు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వారిద్దరూ ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన మరుసటి రోజే నవ వధువు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భర్త తనకు నచ్చలేదంటూ విడాకులు కావాలని పట్టుబట్టింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్‌లో నివాసం ఉంటున్న ఓ యువతికి సోనిపట్‌కు చెందిన.. తన సోదరి భర్త తరపు బంధువైన యువకుడితో పరిచయం ఏర్పడింది. పని నిమిత్తం మొరాదాబాద్‌కు తరచూ వచ్చి వెళ్లే క్రమంలో ఇద్దరూ చనువుగా మాట్లాడుకునేవారు. కొన్నాళ్లకు వీరి పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు తెలీకుండా ఇద్దరూ కలుసుకునేవారు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని యువతి వారి కుటుంబ సభ్యులు తెలియజేసింది. అయితే ముందుగా వారు ఇందుకు ఒప్పుకోలేదు. అయినా తననే పెళ్లి చేసుకుంటానని యువతి పట్టుబట్టడంతో చివరకు తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించాల్సి వచ్చింది.
కాసేపట్లో పెళ్లనగా వరుడికి మైండ్‌బ్లాక్.. వధువుకు వేరే కుర్రాడితో పెళ్లి చేసిన తండ్రి.. అసలు కథేంటంటే..
ఇటీవల వారిద్దరికీ బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించారు. తర్వాత రోజు హనీమూన్‌లో అసలు సమస్య తలెత్తింది. భర్తతో శారీరకంగా కలిసేందుకు నిరాకరించిన నవ వధువు.. పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు భర్తతో ఉండాలని లేదని, విడాకులు ఇప్పించాలని పట్టుబట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకుని, మరుసటి రోజే విడాకులు కోరడంపై యువతి తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు. ఎంత బ్రతిమాలినా యువతి మాత్రం విడాకులు కావాల్సిందే అని పట్టుబట్టింది. చివరకు చాలా మంది పెద్దలు కలుగజేసుకుని కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని విడాకులు తీసుకున్నారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తాళి కట్టిన తర్వాత ఎంటరైన పోలీసులు... కాసేపటికి భర్త స్థానంలో మరిది ప్రత్యక్షం... జరిగిన విషయం తెలుసుకుని అవాక్కయిన బంధువులు
Updated Date - 2022-05-17T18:23:31+05:30 IST