కడుపునొప్పి భరించలేక ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన 33 ఏళ్ల మహిళ.. టెస్టులు చేసి డాక్టర్లు చెప్పిన షాకింగ్ నిజం విని..
ABN, First Publish Date - 2022-09-10T21:53:44+05:30
ప్రస్తుతం చాలా ఆస్పత్రులు.. డబ్బు సంపాదనే ధ్యేయంగా నడుస్తున్నాయి. కొన్నిసార్లు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. చివరకు అసలుకే ఎసరు వస్తుంటుంది. మరికొందరు వైద్యులు..
ప్రస్తుతం చాలా ఆస్పత్రులు.. డబ్బు సంపాదనే ధ్యేయంగా నడుస్తున్నాయి. కొన్నిసార్లు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. చివరకు అసలుకే ఎసరు వస్తుంటుంది. మరికొందరు వైద్యులు.. దెబ్బతిన్న భాగంలో ఆపరేషన్ చేయాల్సింది పోయి.. బాగున్న అవయవాలకు ఆపరేషన్లు చేస్తుంటారు. ఇంకొందరు వైద్యులు.. ఏకంగా మానవ అవయవాలను (Human organs) అక్రమంగా విక్రయిస్తూ.. వైద్య వృత్తికే చెడ్డ పేరు తెస్తుంటారు. బీహార్‌లో ఓ మహిళ విషయంలో దారుణం జరిగింది. కడుపు నొప్పి భరించలేక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి చివరకు అసలు విషయం చెప్పారు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే..
బీహార్ (Bihar) ముజఫర్‌పూర్ జిల్లా బరియార్‌పూర్ ఓపీలోని బాజీ పట్టణంలో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సునీతాదేవి అనే మహిళ తీవ్రమైన కడుపునొప్పితో స్థానికంగా ఉన్న శుభ్‌కాంత్ క్లినిక్‌కు వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భాశయం తొలగించాలని తెలిపారు. సునీత కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో.. చివరకు రూ.30,000లకు ఆపరేషన్ చేసేలా మాట్లాడుకున్నారు. బయటి నుంచి వచ్చిన వైద్యులు.. సెప్టెంబర్ 3న ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే మరుసటి రోజు సునీత పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆమెను మరో ఆస్పత్రికి రెఫర్ చేశారు.
ఐదేళ్లుగా మహిళా టీచర్ వింత ప్రవర్తన.. ఓ రోజు ఫుల్ బాటిల్‌తో స్కూల్‌కు రావడంతో..
చేసేదిలేక చివరకు సెప్టెంబర్ 5న పాట్నా మెడికల్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. రెండు కిడ్నీలు లేవని చెప్పారు. దీంతో సునీత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కిడ్నీలు పోవడమేంటంటూ లబోదిబోమన్నారు. చివరకు బాధితురాలి కుటుం సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్లినిక్ నిర్వాహకుడు పవన్‌పై మానవ అవయవాల మార్పిడి.. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మెడికల్ రిపోర్టుల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వాట్సప్‌లో ఓ యువతి నుంచి వాయిస్ మెసేజ్.. అంతా విని అవాక్కైన పోలీసులు.. హోటల్‌కు వెళ్లి తనిఖీ చేస్తే..
Updated Date - 2022-09-10T21:53:44+05:30 IST