బయటికెళ్లిన భర్త.. ఇంటికొచ్చేసరికే దారుణం.. బెడ్‌రూం తలుపులు తీసి చూడగా...
ABN, First Publish Date - 2022-09-02T02:03:28+05:30
వారికి వివాహమై ఏడేళ్లయింది. కొడుకుతో పాటూ సంతోషంగా ఉన్న సమయంలో భార్య గర్భం దాల్చడంతో భర్త మరింత సంతోషపడ్డాడు. అయితే ఆ ఆనందం వారికి ఎన్నో రోజులు నిలవలేదు...
వారికి వివాహమై ఏడేళ్లయింది. కొడుకుతో పాటూ సంతోషంగా ఉన్న సమయంలో భార్య గర్భం దాల్చడంతో భర్త మరింత సంతోషపడ్డాడు. అయితే ఆ ఆనందం వారికి ఎన్నో రోజులు నిలవలేదు. విధుల నిమిత్తం బయటికి వెళ్లిన భర్త.. తిరిగొచ్చేసరికి అలా జరుగుతుందని ఊహించలేకపోయాడు. ఇంటికి వచ్చి బెడ్‌రూం గది తలుపులు తీసిన అతడు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్‌లోని బిజ్నోర్‌లోని హస్తినాపూర్‌లోని రాంలీలా గ్రౌండ్ సమీపంలో సందీప్ కుమార్ అనే వ్యక్తి.. భార్య శిఖ(25), కుమారుడు రుకాన్ష్ (5)తో కలిసి నివాసం ఉంటున్నాడు. సందీప్ కుమార్.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల సందీప్ భార్య గర్భం దాల్చింది. దీంతో దంపతులు మరింత సంతోషంగా ఉండేవారు. అయితే ఈ సంతోషం వారికి ఎన్నో రోజులు నిలవలేదు. ఇటీవల ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం విధులకు వెళ్లిన సందీప్.. రాత్రి ఇంటికి వచ్చాడు.
పెంచిన పాశాన్ని కర్కశంగా తెంచింది... ప్రియుడితో కలిసి పిన్నిని దారుణంగా..
ఇంట్లో నిశ్శబ్ధంగా ఉండడంతో భార్య, కొడుకు కోసం అంతా వెతికాడు. చివరకు బెడ్‌రూం తలుపులు తీసి చూడగా.. లోపల ఇద్దరూ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నారు. దీంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు నోట్లో దుస్తులు కుక్కి.. కత్తితో గొంతు కోసినట్లు గుర్తించారు. ఇంట్లో నగలు, నగదు కనిపించకపోవడంతో వాటి కోసమే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలిస్తున్నారు.
దైవ దర్శనం కోసం రాష్ట్రం దాటి వచ్చిన కుటుంబం.. హోటల్ గది నుంచి ఉదయాన్నే బయటికి వెళ్లిన బాలిక.. ఐదు రోజుల తర్వాత..
Updated Date - 2022-09-02T02:03:28+05:30 IST