ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండుతున్నాయి కదా అని నులుముకున్న వెంటనే.. చేతిలోకి ఊడిపడిందో కన్ను.. అసలేం జరిగిందో తెలిసి నివ్వెరపోయిన జనం..

ABN, First Publish Date - 2022-10-12T22:48:29+05:30

ఓ గిరిజన గ్రామానికి (Tribal village) చెందిన ఓ వృద్ధుడికి ఏడాది క్రితం కంటి ఆపరేషన్ (Eye operation) చేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా తర్వాత సమస్య దురద మొదలైంది. దీంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ గిరిజన గ్రామానికి (Tribal village) చెందిన ఓ వృద్ధుడికి ఏడాది క్రితం కంటి ఆపరేషన్ (Eye operation) చేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా తర్వాత సమస్య దురద మొదలైంది. దీంతో వైద్యులను సంపద్రించాడు. అయినా ఫలితం లేదు. దీంతో మరో ఆస్పత్రికి వెళ్లాడు. ఇలా చాలా ఆస్పత్రులకు వెళ్లినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. రోజురోజుకూ దురద ఎక్కువ అవడంతో పాటూ మండుతుండడంతో గట్టిగా నులుముకున్నాడు. దీంతో ఒక్కసారిగా అతడి కన్ను ఊడిపడింది. వామ్మో! ఇదేంటీ అని భయపడి ఆస్పత్రికి పరుగులు తీశాడు. అక్కడ వైద్యులు చెప్పింది విని చివరకు అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రం జంషెడ్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని అడవుల మధ్య ఉన్న గిరిజన గ్రామంలో 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామానికి చెందిన గంగాధర్ సింగ్ అనే వృద్ధుడు కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతున్నాడు. కళ్లలో నీళ్లు వస్తుండడంతో పాటూ సక్రమంగా కనిపించకపోవడంతో ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఆ గ్రామానికి ఓ మహిళ వచ్చింది. వృద్ధుడు ఆమెకు తన సమస్యను వివరించాడు. వృద్ధుడితో పాటూ మరికొందరు రోగులను ఎన్‌జీవోల సహకారంతో 2021 నవంబర్‌లో జంషెడ్‌పూర్‌లోని ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. తర్వాత రెండో రోజు అందరినీ ఇంటికి పంపించారు. అయితే కొన్ని రోజుల తర్వాత సదరు వృద్ధుడికి కంటి దురద, మంట మొదలైంది. దీంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స తీసుకున్నా ఫలితం లేదు.

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. బైక్‌లో పెట్రోల్ పోయగానే ఎగిసిపడిన మంటలు.. అసలేం జరిగిందంటే..!


ఈ క్రమంలో చాలా ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేదు. రోజు రోజుకూ దురద ఎక్కువ అవడంతో రుద్దడం మొదలెట్టాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు గట్టిగా రుద్దుకుని, కంటిలో నీళ్లు పోసుకున్నాడు. దీంతో కన్ను ఊడి చేతిలోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా వృద్ధుడు షాక్ అయ్యాడు. లబోదిబోమంటూ ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు.. అది గాజు కన్ను అని తేల్చారు. దీంతో ఆస్పత్రి సిబ్బందితో పాటూ వృద్ధుడి బంధువులంతా షాక్ అయ్యారు. ఈ విషయం ఉన్నతాధికారుల వరకూ వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. వృద్ధుడికి ఆపరేషన్ చేసిన సర్జన్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్తే.. ఉన్న కంటినే తీసేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Viral Video: ట్రైన్‌కు వేళాడుతూ ఇన్‌స్టా రీల్ కోసం ఓ కుర్రాడి రిస్కీ ఫీట్.. చివరకు జరిగిందో వీడియోలో మీరే చూడండి..!



Updated Date - 2022-10-12T22:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising