రాత్రికి రాత్రే ఇంట్లోంచి అదృశ్యమైన అత్త, అల్లుడు.. కంగారుగా ఊరంతా వెతికిన భార్య.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
ABN, First Publish Date - 2022-06-28T21:12:46+05:30
వారిద్దరికీ ఏడాది క్రితమే వివాహమైంది. ఇటీవలే భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ అంతా సంతోషంగా గడిపారు. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. రాత్రికి రాత్రే అత్త, అల్లుడు ఇంట్లోంచి అదృశ్యమయ్యారు. దీంతో తల్లి..
వారిద్దరికీ ఏడాది క్రితమే వివాహమైంది. ఇటీవలే భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ అంతా సంతోషంగా గడిపారు. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. రాత్రికి రాత్రే అత్త, అల్లుడు ఇంట్లోంచి అదృశ్యమయ్యారు. దీంతో తల్లి, తన భర్త కోసం.. భార్య ఊరంతా వెతికింది. అయినా వారు ఎక్కడా కనిపించలేదు. అయితే చివరకు వారికి షాకింగ్ వార్త తెలిసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కెరవాలో నివాసం ఉంటున్న భీమారం కుమారుడు హోతారామ్ (25)కు.. ఖన్రాతియా గ్రామానికి చెందిన నెమారం కుమార్తె గీత (20)తో ఏడాది క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండేవారు. మూడు రోజుల క్రితం భార్యను తీసుకుని.. ఖన్రాతియా గ్రామంలోని అత్తగారింటికి వెళ్లాడు. సోమవారం అంతా సంతోషంగా గడిపారు. అయితే రాత్రి ఉన్నట్టుండి అత్త దరియా(38) , అల్లుడు అదృశ్యమయ్యారు. దీంతో హోతారామ్ భార్యతో సహా అంతా కంగారుపడ్డారు. తల్లి, భర్త కోసం ఆమె ఊరంతా వెతికింది. అయినా ఫలితం లేదు.
యువతులు తోటలో ఉండగా వీడియో తీసిన యువకుడు.. చెల్లెళ్ల వీడియోను డిలీట్ చేయమన్న అన్న.. చివరకు..
ఈ క్రమంలో గ్రామానికి 30 కిలోమీటర్లు దూరంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అత్త, అల్లుడి మధ్య కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, దీని కారణంగా వారు ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రేయసిని కొండపై నుంచి తోసేసిన ప్రియుడు.. కింద పడుతూ గాలిలోనే ప్రియుడికి బ్రేకప్ చెప్పిన యువతి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..
Updated Date - 2022-06-28T21:12:46+05:30 IST