ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యం చేసే క్రమంలో ఆమెతో పరిచయం.. తీరా పెళ్లి చేసుకుంటుండగా మంటపంలో ఊహించని twist.. చివరకు ఏమైందంటే..

ABN, First Publish Date - 2022-07-09T01:55:55+05:30

అతనో కాంపౌండర్.. వైద్యం చేసే క్రమంలో ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా రోజూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతనో కాంపౌండర్.. వైద్యం చేసే క్రమంలో ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా రోజూ మాట్లాడుకునే వారు. చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రహస్యంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహం పూర్తయిన వెంటనే అక్కడ ఊహించని ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం బెగుసరాయ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మనోహర్ అనే యువకుడు.. ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడూ ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యం చేసేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం.. ఓ వ్యక్తి తన కూతురికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కాంపౌండర్‌ను ఇంటికి పిలింపించాడు. వైద్యం చేసే క్రమంలో బాలికకు, కాంపౌండర్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు తెలీకుండా రోజూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఇటీవల  పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు.

Uttar Pradesh: నేను చెప్పినట్లు చేస్తే రోజూ ఆదాయం వస్తుంది.. అంటూ భార్యకు నచ్చజెప్పాడు.. మరుసటి రోజే స్నేహితుడిని ఇంట్లోకి పిలిచి..


అయినా వారు మాత్రం ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో జూలై 6న ఎవరికీ తెలీకుండా మనోహర్ పెళ్లి ఏర్పాట్లు చేశాడు. బాలిక ఇంట్లో చెప్పకుండా ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. కొంతమంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే అదే సమయంలో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులంతా అక్కడికి చేరుకున్నారు. తమ కుమార్తెను తమకు అప్పగించాలని గొడవ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధూవరులను స్టేషన్‌కు తీసుకెళ్లారు. మనోహర్‌పై కిడ్నాప్ చేసిన పోలీసులు.. శుక్రవారం ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Action: కర్ర, బియ్యం, పచ్చిమిర్చితో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మహిళ.. పోలీసుల నెత్తిపై అక్షింతలు చల్లి మరీ.. ఆమె చేసిన నిర్వాకం..

Updated Date - 2022-07-09T01:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising