Live in relationship: సహజీవనం సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన పోలీసులకు షాక్.. రక్తం ప్యాకెట్లు బయటపడడంతో..
ABN, First Publish Date - 2022-10-13T21:47:01+05:30
వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ అంతకు ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్లు సహజీవనం చేయాలని..
వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ అంతకు ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్లు సహజీవనం చేయాలని భావించారు. ఈ క్రమంలో ఇటీవల వారికి ఓ కొడుకు కూడా పుట్టాడు. తర్వాత వారి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. త్వరలో చేసుకుంటానని చెప్పడంతో ఆమె సంతోషించింది. అయితే రోజులు గడుస్తున్నా వివాహం మాత్రం చేసుకోవడం లేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. చివరికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేసేందుకు వెళ్లిన పోలీసులు.. లోపల రక్తం ప్యాకెట్లు బయటపడడంతో షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సంగంలోని ప్రయాగ్‌రాజ్ పరిధికి చెందిన షాన్ మొహమ్మద్‌కు నాలుగేళ్ల క్రితం స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం చివరకు ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం (marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతకు ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని భావించారు. ఇందుకోసం కొన్నాళ్లు సహజీవనం (Live in relationship) చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లకు వారికి ఓ కొడుకు కూడా పుట్టాడు. ఇటీవల వారి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. కొన్నాళ్లు పోతే చేసుకుంటానని చెప్పాడు. అయితే రోజులు గడుస్తున్నా వివాహం మాత్రం చేసుకోవడం లేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. చివరకు విసిగిపోయిన మహిళ.. పోలీసులను ఆశ్రయించింది.
పొలంలో చేతి పంపు నుంచి ఉబికివస్తున్న మద్యం.. ఏడు అడుగుల లోతు తవ్వి చూడగా.. షాకింగ్ సీన్..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం షాన్ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ రక్తం ప్యాకెట్లు ఉండడం చూసి షాక్ అయ్యారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమందితో కలిసి షాన్.. రక్తాన్ని సేకరించి, దాన్ని అక్రమంగా విక్రయించేవాడని తెలిసింది. నిరుపేదలకు రూ.1000 నుంచి రూ.1,500లు ఎరచూపి.. అనంతరం ఆ ప్యాకెట్లపై నకిలీ బ్లడ్ బ్యాంక్ రసీదులను అతికించి రూ.7నుంచి రూ.10వేలకు విక్రయించేవారని గుర్తించారు. నిందితుడు షాన్‌తో సహా మొత్తం 12మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి నుంచి 128 యూనిట్ల రక్తం, బ్లడ్ బ్యాంక్ రసీదులు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Govt Jobs: అదృష్టం అంటే ఇదే కదా.. ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంకో విశేషం ఏంటో తెలుసా..
Updated Date - 2022-10-13T21:47:01+05:30 IST