ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియర్లు చేసిన పనికి.. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న యువతులు.. పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా..

ABN, First Publish Date - 2022-09-24T22:02:44+05:30

మొహాలీలోని చండీగఢ్ యూనివర్శిటీలో (Chandigarh University) విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు (girls bathing videos) తీసి, వాటిని సోషల్ మీడియాలో షేర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొహాలీలోని చండీగఢ్ యూనివర్శిటీలో (Chandigarh University) విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు (girls bathing videos) తీసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. సీనియర్లు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాక.. చివరకు ఆ యువతులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక తికమక పడడంతో చివరకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) భోపాల్‌ పరిధి గోవింద్‌పురాలోని ఐటీఐ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు, యువకులు విద్యనభ్యసిస్తున్నారు. ఇదిలావుండగా, ఈ కళాశాల పూర్వ విద్యార్థులైన రాహుల్ యాదవ్, ఖుష్బూ ఠాకూర్, అయాన్ అనే ముగ్గురు యువకులు.. యువతులను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural events) నిర్వహించారు. ఆ సమయంలో దుస్తులు మార్చుకుంటున్న యువతులను టార్గెట్ చేశారు. అదే సమయంలో దుస్తులు మార్చుకుంటున్న (Changing clothes) ఓ యువతిని వీడియో తీశారు.

మాకు నిశ్చితార్థం జరిగింది.. తను నాకు కాబోయే భార్య.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండని.. కాళ్లు పట్టుకుని వేడుకున్నా..


సెప్టెంబర్ 20వ తేదీన ఆ వీడియోను బాధిత యువతికి తన స్నేహితురాలు చూపించింది. వీడియోలో నగ్నంగా ఉన్న తనను తాను చూసుకుని షాక్ అయింది. తర్వాత సీన్‌లోకి ఎంటరైన పూర్త విద్యార్థులు.. ఆమెను డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో బాధిత యువతి భయంతో వణికిపోయింది. అప్పటికప్పుడు రూ.500లు ఇచ్చి.. డిలీట్ చేయమని వేడకుంది. అయితే మరింత మొత్తం కావాలంటూ ఆమెను వారు బెదిరించడం మొదలెట్టారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక, మరోవైపు అంత డబ్బులు ఇవ్వలేక.. ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.

తరగతి గదిలో ఉండాల్సిన బాలికలు.. పాఠశాల మరుగుదొడ్డిలో.. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్..


ఏం  చేయాలో అర్థం కాక స్నేహితురాలితో కలిసి.. ఎక్కడికైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకంది. ఇద్దరూ రైల్వే స్టేషన్‌లో ఆలోచిస్తూ కూర్చున్నారు. అక్కడ ఉన్న పోలీసులు వీరిని గమనించారు. అనుమానాస్పదంగా ఉండడంతో వారి వద్దకు వెళ్లి ప్రశ్నించారు. సమాధానాలు చెప్పే క్రమంలో తడబడుతుండడంతో వారి అనుమానం మరింత బలపడింది. చివరకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ముగ్గురు పూర్వ విద్యార్థులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ కేసు స్థానికంతా తీవ్ర చర్చనీయాంశమైంది.

World Biggest Killer: షాకింగ్.. ప్రతీ యేటా 4 కోట్ల మందికి పైగా జనాల ప్రాణాలను తీస్తున్నది ఏంటో తెలుసా..?



Updated Date - 2022-09-24T22:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising