ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వీడేంట్రా.. అంత పెద్ద భవనం పైనుంచి ఇంత ఈజీగా దిగేశాడు.. ఇది రియలా.. లేక గ్రాఫిక్సా..

ABN, First Publish Date - 2022-06-19T22:23:12+05:30

కొందరిని చూస్తే.. వీరికేమైనా అద్భుత శక్తులు ఉన్నాయా అని అనిపిస్తుంది. వారు చేసే విన్యాసాలు చూస్తే ఇది కలనా లేక నిజమా అనే సందేహం వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరిని చూస్తే.. వీరికేమైనా అద్భుత శక్తులు ఉన్నాయా అని అనిపిస్తుంది. వారు చేసే విన్యాసాలు చూస్తే ఇది కలనా లేక నిజమా అనే సందేహం వస్తుంది.  ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు తరచూ దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. ఇది నిజమా లేక గ్రాఫిక్సా అని అనిపిస్తుంది. ఓ వ్యక్తి పెద్ద భవనం పైనుంచి ఎలాంటి సాయం తీసుకోకుండా.. అమాంతం కిందకు దూకేసి, ఎంతో చాకచక్యంగా దిగేశాడు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు..


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దాదాపు నాలుగు, ఐదు అంతస్థుల భవనంపైన ఓ వ్యక్తి నిలబడి దూకేందుకు సిద్ధంగా ఉంటాడు. అయితే అతడు ఏ సాయమూ తీసుకోలేదు. అంతా చూస్తుండగానే లిఫ్ట్ గోడల మధ్యలోకి అమాంతం దూకేస్తాడు. రెండు గోడల మధ్యలోకి దూరి, కాళ్ల సాయంతో చాకచర్యంగా కిందకు దిగేస్తాడు. ఆ సమయంలో ఏమాత్రం పట్టుతప్పినా పెద్ద ప్రమాదం జరిగుండేది. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈజీగా కిందకు దిగేసి, దర్జాగా నడుకుంటూ వెళ్లిపోతాడు. పైనుంచి ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘దీన్ని ఎవరూ అనుకరించవద్దు’’ అని హెచ్చరిస్తూ వీడియోను పోస్టు చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వామ్మో! వీడెక్కడి మనిషిరా బాబూ.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి..

కాలువ దాటేందుకు సాహసం చేసిన యువతి.. పాపం చివరి నిమిషంలో ఊహించని షాక్..





Updated Date - 2022-06-19T22:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising