Viral Video: ఆటోలో తీసుకెళ్లాల్సిన లగేజీ.. స్కూటర్‌పై.. తమ్ముడూ! జాగ్రత్త అంటున్న నెటిజన్లు..
ABN, First Publish Date - 2022-06-23T02:46:22+05:30
కొందరు తెలిసి చేస్తారో.. తెలీక చేస్తారో.. తెలీదుగానీ చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ అందరి నోళ్లలో నానుతుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో...
కొందరు తెలిసి చేస్తారో.. తెలీక చేస్తారో.. తెలీదుగానీ చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ అందరి నోళ్లలో నానుతుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో వినూత్నమైన విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. అయినా మళ్లీ మళ్లీ అదే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి స్కూటర్‌పై పరిమితికి మించిన సరుకులు వేసుకుని, ప్రమాదకర స్థితిలో డ్రైవింగ్ చేయడం... వైరల్‌గా మారింది. తమ్ముడూ! జర జాగ్రత్త అంటూ నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన స్కూటర్‌పై భారీ ఎత్తున లగేజీ వేసుకుని వెళ్తుంటాడు. ఆటోలో తీసుకెళ్లాల్సిన లగేజీని.. స్కూటర్‌లో ఇరికించి మరీ తీసుకెళ్తుంటాడు. చివరకు తనకు కూర్చోవడానికి స్థలం కూడా ఉండదు. స్కూటర్ చివరన కొంత స్థలంలో కూర్చుని, ముందుకు వంగి.. హ్యాండిల్ పట్టుకుని డ్రైవ్ చేస్తుంటాడు. ఇతన్ని చూసి మిగతా వాహనదారులు షాక్ అయ్యారు. వెనుక వస్తున్న వాహనంలోని ఓ వ్యక్తి... వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తమ్ముడూ! జాగ్రత్త.. అంటూ కొందరు సలహా ఇస్తుండగా.. మరికొందరు అతడి నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
వీడేంట్రా.. అంత పెద్ద భవనం పైనుంచి ఇంత ఈజీగా దిగేశాడు.. ఇది రియలా.. లేక గ్రాఫిక్సా..
Updated Date - 2022-06-23T02:46:22+05:30 IST