Viral Video: ఎస్కలేటర్‌పై వెళ్తూ ప్రేమ జంట రొమాన్స్.. మరుక్షణంలోనే ఊహించని ఘటన..!
ABN, First Publish Date - 2022-06-19T00:10:54+05:30
ప్రేమలో ఉన్నవారికి ప్రపంచంతో పని ఉండదు. కొందరికైతే సమయం, సందర్భం, స్థలం ఇవేవీ పట్టవు. ఇక పార్కుల్లో కొంత మంది ప్రేమ జంటల తీరు అందరికీ ఇబ్బంది కలిగించేలా ఉంటుంది...
ప్రేమలో ఉన్నవారికి ప్రపంచంతో పని ఉండదు. కొందరికైతే సమయం, సందర్భం, స్థలం ఇవేవీ పట్టవు. ఇక పార్కుల్లో కొంత మంది ప్రేమ జంటల తీరు అందరికీ ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. ఎవరేమనుకున్నా.. ప్రేమికులు మాత్రం వారి లోకంలో వారుంటారు. కొన్నిసార్లు వారి ప్రవర్తన చూస్తే.. రొమాన్స్ చేసుకోవడానికి వీళ్లకు వేరే స్థలమే లేదా... అనిపించేలా ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ ప్రేమజంట ఏకంగా ఎస్కలేటర్‌పైనే రొమాన్స్ మొదలెట్టింది. అయితే మరుక్షణంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ప్రేమజంట ఎస్కలేటర్‌పైకి ఎక్కుతుంది. ఎక్కిన కొద్ది సేపటికే రొమాన్స్ మొదలెడతారు. ఒకరికిఒకరు ముద్దు పెట్టుకునే క్రమంలో పొరపాటున అదుపుతప్పి కిందపడిపోతారు. నాలుగైదు స్టెప్స్ నుంచి పల్టీలు కొడుతూ కిందకు వస్తారు. వెంటనే తేరుకుని ‘‘ఎవరూ చూడలేదు కదా’’ అనుకుంటూ మళ్లీ ఎస్కలేటర్‌పైకి ఎక్కి వెళ్లిపోతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
విద్యార్థులతో కలిసి టీచర్.. ఆటా, పాటా.. ఉపాధ్యాయులు అంటే ఇలా వుండాలంటున్న నెటిజన్లు..
Updated Date - 2022-06-19T00:10:54+05:30 IST