ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నాతోనే తమాషా.. వెకిలి చేష్టలు చేసిన యువకుడికి చుక్కలు చూపించిన గొరిల్లా..

ABN, First Publish Date - 2022-06-16T03:06:04+05:30

శాంతంగా ఉన్నాయిలే.. మనల్ని ఏం చేస్తాయిలే.. అని జంతువుల వద్ద చాలా మంది పిచ్చి చేష్టలు చేస్తుంటారు. అలాంటి సమయంలో కొన్నిసార్లు కథ అడ్డం తిరుగుతుంటుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాంతంగా ఉన్నాయిలే.. మనల్ని ఏం చేస్తాయిలే.. అని జంతువుల వద్ద చాలా మంది పిచ్చి చేష్టలు చేస్తుంటారు. అలాంటి సమయంలో కొన్నిసార్లు కథ అడ్డం తిరుగుతుంటుంది. ఉన్నట్టుండి పట్టలేని కోపంతో మనుషులపై జంతువులు దాడులు చేసిన ఘటనలు చాలా చూశాం. జూలలో కొంతమంది సందర్శకులు కూడా ఇలాగే ప్రవర్తిస్తుంటారు. సింహం బోనులో ఉంది కదా అని.. పిచ్చి వేషాలు వేసి, వాటి దాడికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. గొరిల్లా బోనులో ఉంది కదా అని.. ఓ ఆకతాయి వెకిలి వేషాలు వేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన గొరిల్లా.. చివరికి ఆకతాయికి చుక్కలు చూపించింది.


ఇండోనేషియాలోని రియావులోని కసాంగ్ కులిమ్ అనే జూలో జూన్ 6న ఈ ఘటన చోటు చేసుకుంది. హసన్ అరిఫిన్‌ అనే వ్యక్తి జూలో జంతువులను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గొరిల్లా ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లాడు. అప్పటికి గొరిల్లా శాంతంగా ఉంది. దీంతో తనను ఏం చేస్తుందిలే అనుకుని.. ఆ యువకుడు బోను వద్దకు వెళ్లి వెకిలి వేషాలు వేశాడు. నా దగ్గరే వెకిలి వేషాలా.. అనుకుందే ఏమో గానీ.. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. కడ్డీల మధ్యలో నుంచి చేయి బయటకు పెట్టి, యువకుడి చొక్కాను గట్టిగా పట్టుకుంటుంది. అనూహ్య ఘటనకు అక్కడున్న వారంతా షాక్ అవుతారు. పక్కనే ఉన్న ఓ వ్యక్తి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది.

పశువుకు అనారోగ్యంగా ఉండడంతో చూడటానికి వెళ్లిన వైద్యుడు.. మరుక్షణం పెళ్లి మంటపంలో ప్రత్యక్షం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


గొరిల్లా నుంచి విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. అది మాత్రం యువకుడిని విడిచిపెట్టదు. కొద్దిసేపటి తర్వాత కాలు పట్టుకుని పైకి ఎత్తుతుంది. అధికారులు భోజనం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని కసంగ్ కులీమ్ జూ మేనేజర్ దేస్రిజల్ తెలిపారు. సందర్శకులు జంతువుల ఎన్‌క్లోజర్‌ల దగ్గరికి వెళ్లొద్దని హెచ్చరిక బోర్డులు పెట్టినా కొంతమంది పట్టించుకోవడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

షాకింగ్ వీడియో: ఎలుగు బంటిని చూడగానే ఆనందంతో దాని వైపే పరుగులు తీసిన చిన్న పాప.. చివరకు..





Updated Date - 2022-06-16T03:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising