Viral Video: సముద్రపు ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న సమయంలో.. యువతుల నిర్లక్ష్యం ఎంత పని చేసింది.. అంత చూస్తుండగా..
ABN, First Publish Date - 2022-07-13T02:22:47+05:30
అధికారుల హెచ్చరికలను కొందరు తేలిగ్గా తీసుకుంటుంటారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున.. జాగ్రత్తలు పాటించాలని అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ..
అధికారుల హెచ్చరికలను కొందరు తేలిగ్గా తీసుకుంటుంటారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున.. జాగ్రత్తలు పాటించాలని అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా చాలా మంది ఇవేవీ పట్టించుకోవడం లేదు. తీరా నష్టం జరిగాక పశ్చాత్తాప పడటం కంటే ముందే జాగ్రత్తలు పాటించాలనే విషయాన్ని గ్రహించడం లేదు. దీనిపై అవగాహన కల్పించేందుకు.. ఐపీఎస్ అధికారిణి షిఖా గోయెల్.. తన ట్విటర్ ఖాతా ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. అలజడిగా ఉన్న సముద్రం ఒడ్డున కొందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో నిర్లక్ష్యం కారణంగా విషాధ ఘటన చోటు చేసుకుంటుంది.
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఐపీఎస్ అధికారిణి ఈ వీడియోను షేర్ చేశారు. అందులో తీవ్ర అలజడిగా ఉన్న సముంద్ర ఒడ్డున చాలా మంది యువతీయువకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద అలలను సైతం పట్టించుకోకుండా ఎవరి ఆనందంలో వారు ఉంటారు. ఈ సమయంలో ఓ పెద్ద అల అమాంతం వారి మీద పడుతుంది. దీంతో అంతా చూస్తుండగానే కొందరు యువతులు అందులో కొట్టుకుపోతారు. పక్కన ఉన్న వారు కాపాడాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వర్షాలు ఎక్కువగా పడుతున్నందున.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, షిఖా గోయెల్ ఈ వీడియోను షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
Viral Video: అద్దంలో తనను తాను చూసుకున్న ఎలుగుబంటి.. చివరకు ఎలా రియాక్ట్ అయిందో చూడండి..
Updated Date - 2022-07-13T02:22:47+05:30 IST