ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video: వధూవరులిద్దరికీ జ్యూస్‌ తాగించి.. ఎంత పని చేశారు.. తీరా చూస్తే..

ABN, First Publish Date - 2022-04-04T03:25:23+05:30

సరదాలకు ఓ హద్దు అంటూ ఉంటుంది.. అంటూ పెద్దలు అంటూ ఉంటారు. అయితే నేటి యువత మాత్రం ఆ మాటలను పెడచెవిన పెట్టి.. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరదాలకు ఓ హద్దు అంటూ ఉంటుంది.. అంటూ పెద్దలు అంటూ ఉంటారు. అయితే నేటి యువత మాత్రం ఆ మాటలను పెడచెవిన పెట్టి.. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి వారి ప్రవర్తన చూస్తే విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. వేడుక సమయాల్లో అయితే యువత అల్లరి అంతా ఇంతా కాదు. సరదాల పేరుతో చెలరేగిపోతుంటారు. ఇక పెళ్లిళ్ల సమయంలో వరుడి స్నేహితుల అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నానా హంగామా చేస్తూ.. అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకొంటూ ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వరుడి స్నేహితులు చేసిన పని తెలుసుకుని చివరకు అంతా అవాక్కయ్యారు..


ఓ వివాహ వేడుకలో బంధువులు అందరితో కళ్యాణ మండపం సందడి సందడిగా ఉంటుంది. మరోవైపు వధూవరులు ఇద్దరూ వేదికపై దండలు మార్చుకుంటూ ఉంటారు. ఇంతలో వరుడి స్నేహితుల అల్లరి మొదలవుతుంది. ఆటపట్టించడానికి ఎన్నో మార్గాలు ఉన్నా.. వీరు మాత్రం విచిత్రంగా చేశారు. జ్యూస్ ప్యాకెట్ తీసుకుని, అందులో సంగం తాగేసి.. మిగతా సగాన్ని మందుతో నింపేశారు. అనుమానం రాకుండా ఇంజెక్షన్ ద్వారా మందును అందులో నింపేశారు. ముందుగా వరుడికి జ్యూస్‌ని అందిస్తారు. కొంచెం తాగాక అనుమానం వచ్చి.. తాగింది మొత్తం ఊసేస్తాడు. తర్వాత వధువును కూడా తాగమని చెబుతారు. పక్కనున్న వారు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

వ్యభిచారం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న భర్త.. పోలీసులకు పట్టుబడ్డ మహిళ.. అతడి భార్యే అని తెలిసి..





Updated Date - 2022-04-04T03:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising