శోభనాన్ని వాయిదా వేస్తున్న భర్త.. ఓ రోజు రాత్రి నిద్రపోతోందనుకుని ఫోన్లో అతడు మాట్లాడేది ఆమె విని..
ABN, First Publish Date - 2022-04-09T19:00:24+05:30
అనారోగ్యంగా ఉందంటూ ఓ భర్త.. శోభనాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో వాట్సప్‌లో స్నేహితుడితో భర్త చేసిన చాటింగ్‌ను భార్య చూసింది. దీంతో అసలు విషయం...
కొందరు తమలోని లోపాలను కప్పిపెట్టి .. పైకి మాత్రం హుందాగా కనిపిస్తూ ఎదుటి వారిని మోసం చేస్తుంటారు. చివరకు అసలు విషయం తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. దంపతుల విషయంలో ఇలాంటి తరహా సమస్యలు తలెత్తితే... ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయో ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉంటుంది. తాజాగా మహారాష్ట్రలో దంపతుల మధ్య ఇలాంటి సమస్యే తలెత్తింది. అనారోగ్యంగా ఉందంటూ ఓ భర్త.. శోభనాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో వాట్సప్‌లో స్నేహితుడితో భర్త చేసిన చాటింగ్‌ను భార్య చూసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే...
మహారాష్ట్రలోని థానే పరిధిలోని ఓ యువతి, యువకుడికి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిప్రాయాలు నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి గత ఏడాది నవంబర్ 20న వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఇద్దరూ హనీమూన్ వెళ్లారు. అయితే శోభనం రోజు రాత్రి భార్యతో.. ‘‘నాకు అనారోగ్యంగా ఉంది.. కొన్నాళ్లు శోభనాన్ని వాయిదా వేద్దాం’’.. అని చెప్పడంతో అతడి భార్యకూడా అర్థం చేసుకుంది. అయితే రోజులు గడుస్తున్నా ఇదే సమాధానం చెబుతుండడంతో ఆమెకు అనుమానం కలిగింది. ఓ రోజు పడక గదిలోనే దంపతులు ఇద్దరూ ఉన్నారు. ఈ సమయంలో భార్య నిద్రపోతోందనుకుని.. భర్త ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అయితే ఆ మాటలను భార్య వినింది. ఇద్దరు మగవారు కలిసి ఫోన్లలో రాసలీలలు, శృంగారం వంటి విషయాలపై మాట్లాడుకోవడం విని ఆమె అవాక్కయింది.
పరీక్షలంటే భయమేసి.. ప్రియుడిని పిలిచి పారిపోదామని చెప్పింది.. అయితే దారి మధ్యలో అతడు ప్లాన్ మార్చడంతో...
తర్వాత భర్త ఫోన్‌ని పరిశీలించగా.. అందులో మగ స్నేహితులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు కనిపించాయి. దీంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి భర్త స్వలింగ సంపర్కుడని తెలిసింది. అయినా ఈ విషయం దాచి పెట్టి.. తనకు మంచి ఉద్యోగం ఉందని, నకిలీ సర్టిఫికెట్ చూపించి పెళ్లి చేసుకున్నట్లు తేలింది. పెళ్లి సమయంలో తమకు రూ.18,90,000లు ఖర్చయిందని, అలాగే బంగారు నగలకు కూడా చాల ఖర్చు అయిందని బాధితురాలు వాపోయింది. తన భవిష్యత్ నాశనం చేశాడని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచిన అనంతరం జైలుకు తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.
పాయసం తిన్న పిల్లలు కాసేపటికే ఆస్పత్రిలో చేరిక.. చివరగా తల్లి చేసిన పని తెలుసుకుని అంతా షాక్..
Updated Date - 2022-04-09T19:00:24+05:30 IST