ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరాయి మహిళతో పారిపోయేందుకు సిద్ధపడ్డాడు.. అర్ధరాత్రి ఆమెను తీసుకెళ్తుండగా దారి మధ్యలో..

ABN, First Publish Date - 2022-04-07T14:28:07+05:30

అనుకోకుండా ఏర్పడే పరిచయాలు.. ఒక్కోసారి అక్రమ సంబంధానికి దారి తీస్తుంటాయి. దీనివల్ల అప్పటి వరకు సాఫీగా సాగిన జీవితంలో ఒక్కసారిగా సమస్యలు వచ్చిపడుతుంటాయి. భార్యాభర్తల..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుకోకుండా ఏర్పడే పరిచయాలు.. ఒక్కోసారి అక్రమ సంబంధానికి దారి తీస్తుంటాయి. దీనివల్ల అప్పటి వరకు సాఫీగా సాగిన జీవితంలో ఒక్కసారిగా సమస్యలు వచ్చిపడుతుంటాయి. భార్యాభర్తల మధ్య అప్పటిదాకా ఉన్న ప్రేమ దూరమై.. పగ, ప్రతీకారాలు చోటు చేసుకుంటాయి. చివరకు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తుంటాయి. ఛత్తీస్‌గఢ్‌లో మహిళతో అతడికి ఏర్పడిన పరిచయం.. చివరికి సమస్యలకు దారి తీసింది.  మహిళతో కలిసి పారిపోయేందుకు సిద్ధపడుతుండగా.. దారి మధ్యలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గఢ్‌ జష్‌పూర్‌ పరిధి నారాయణపూర్‌కు చెందిన సోనూ యాదవ్ అనే వ్యక్తికి.. సమీప ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్తకు తెలీకుండా ఆ మహిళ.. సోనూ యాదవ్‌ను కలుస్తూ ఉండేది. ఏడాదిగా వీరి వ్యవహారం గురించి ఎవరికీ తెలీదు. అయితే నెల క్రితం మహిళ భర్త..  లలిత్ రామ్ చౌహాన్‌‌కు ఈ విషయం తెలిసింది. దీంతో భార్యను గట్టిగా మందలించాడు. ఇంకోసారి అతడితో మాట్లాడొద్దంటూ హెచ్చరించాడు. అలాగే సోనూయాదవ్‌పై కూడా దాడి చేసి, తన భార్య జోలికి రావొద్దని చెప్పాడు. అయినా సోనూయాదవ్ మాత్రం ఆమెను కలవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో మార్చి 24న మహిళను కలిసి కొత్త సిమ్ కొనిచ్చాడు. భర్తకు తెలీకుండా ఫోన్లలో మాట్లాడుకునేవారు. అయితే సోనూయాదవ్.. సిమ్ ఇచ్చిన విషయాన్ని కొన్నాళ్ల తర్వాత మహిళ తన భర్తకు చెప్పింది.

ఒక్క ఫొటోతో సోషల్ మీడియానే షేక్ చేసింది.. ఈ 11 ఏళ్ల పాప సంకల్పం చూసి ఏకంగా ముఖ్యమంత్రే..


దీంతో ఎలాగైనా సోనూయాదవ్‌ను అంతమొందించాలని కుట్రపన్నాడు. ఇదే విషయాన్ని భార్యకు చెప్పి, ఆమెతో సోనూయాదవ్‌కు ఫోన్ చేయించాడు. ’’ఇద్దరం కలిసి పారిపోదాం.. వచ్చెయ్’’.. అంటూ మహిళ చెప్పడంతో సోనూయాదవ్ అందుకు అంగీకరించాడు. ఏప్రిల్ 3న రాత్రి మహిళ చెప్పిన ప్రాంతానికి బైక్‌పై వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లగానే మహిళ భర్త కూడా ఉండడంతో షాక్ అయ్యాడు.  రామ్ చౌహాన్‌‌, అతడి భార్య కలిసి ఒక్కసారిగా సోనూయాదవ్‌పై దాడి చేశారు. తీవ్రగాయాలవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

నాలుగేళ్లుగా వీడని మిస్టరీ.. ఇంతకీ ఈ 24 ఏళ్ల యువతి ఏమైపోయింది..? అసలేం జరిగిందంటే..

Updated Date - 2022-04-07T14:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising