నిర్మానుష్య ప్రదేశంలో దుస్తులు లేకుండా పడి ఉన్న బాలిక.. మాట్లాడలేని స్థితిలోనూ హావభావాల ద్వారా ఆమె చెప్పింది విని..
ABN, First Publish Date - 2022-09-21T21:38:21+05:30
ఒంటరిగా కనిపించే మహిళలను టార్గెట్ చేయడం, తమ మాట వినని వారిపై దాడులు చేయడం.. చిరకు అత్యాచారం, హత్యలకు పాల్పడే ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. బీహార్‌లో ఓ బాలిక..
ఒంటరిగా కనిపించే మహిళలను టార్గెట్ చేయడం, తమ మాట వినని వారిపై దాడులు చేయడం.. చిరకు అత్యాచారం, హత్యలకు పాల్పడే ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. బీహార్‌లో ఓ బాలిక (girl) విషయంలో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన బాలిక.. కాసేపటికే దుస్తులు లేకుండా పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక.. మాట్లాడలేని స్థితిలో ఉన్నా, హావభావాల ద్వారా తనపై జరిగిన దారుణం గురించి తెలియజేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బీహార్ (Bihar) బెట్టియా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 14ఏళ్ల బాలిక.. గురువారం వేకువజాము 4గంటలకు బహిర్భూమికి వెళ్లింది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు.. బాలిక వెంటే వెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో ఒక్కసారిగా ఆమె నోరు మూసి పక్కకు లాక్కెళ్లారు. దాడి చేయడంతో పాటూ ఇద్దరూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి తెలుస్తుందనే ఉద్దేశంతో చివరకు బాలిక గొంతు కోశారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
అక్కా! నీతో మాట్లాడాలి.. అంటూ కారులో ఊరి బయటకు తీసుకెళ్లాడు.. తన మాటకు అభ్యంతరం చెప్పడంతో చివరకు..
చనిపోయిందనుకుని ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. దుస్తులు లేకుండా పడి ఉన్న బాలికను స్థానికులు గమనించారు. చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న బాలిక.. హావభావాల ద్వారా తనపై జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలియజేసింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఫొటోలు పంపిన యువతి.. మరుసటి రోజు తన వాట్సప్‌కు వచ్చిన వీడియో చూసి షాక్..
Updated Date - 2022-09-21T21:38:21+05:30 IST