ఢిల్లీలోని ప్రముఖ చర్చ్‌లు ఇవే...
ABN, First Publish Date - 2022-12-20T11:53:22+05:30
క్రిస్మస్ పండుగ రాబోతోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ వైభవంగా జరుపుకుంటారు. క్రిస్మస్ క్రైస్తవ మతస్తులకు అతి ముఖ్యమైన పండుగ. క్రైస్తవ కుటుంబాల్లో, క్రిస్మస్ పండుగ సందడి ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 24 నుండి ప్రారంభమవుతుంది.
క్రిస్మస్ పండుగ రాబోతోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ వైభవంగా జరుపుకుంటారు. క్రిస్మస్ క్రైస్తవ మతస్తులకు అతి ముఖ్యమైన పండుగ. క్రైస్తవ కుటుంబాల్లో, క్రిస్మస్ పండుగ సందడి ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 24 నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజును ఏసుక్రీస్తు జన్మదినంగా జరుపుకుంటారు. రోమ్ దేశంలో మొదటి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ రోజున క్రైస్తవ మతస్తులు చర్చికి వెళతారు చర్చిలను అందంగా అలంకరింస్తారు. ఆ రోజు స్వీట్లు, చాక్లెట్లు పంచుతారు. కొందరు శాంతాక్లాజ్ వేషం వేసి పిల్లలకు బహుమతులు ఇస్తారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఢిల్లీలోని పలు పురాతన చర్చిలను అందంగా అలంకరిస్తారు.
సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ చర్చి ఢిల్లీలోని ప్రముఖ చర్చి, ఇక్కడ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అదేవిధంగా సెయింట్ జేమ్స్ చర్చి కశ్మీర్ గేట్ ప్రాంతంలో ఉంది. ఢిల్లీలోని ప్రసిద్ధ చర్చి అయిన సెయింట్ థామస్ చర్చిని 1972లో నిర్మించారు. ఈ చర్చి ఇతర చర్చిలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ భవన రూపకల్పన మొఘల్ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఈ చర్చి ఆర్కే పురంలో ఉంది. ఢిల్లీ డిఫెన్స్ కాలనీలో సెయింట్ లూక్స్ చర్చి ఉంది, క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చిన అందంగా అలంకరించారు. ఇవే కాకుండా ఢిల్లీలో అనేక చర్చిలు ఉన్నాయి. ఇవి క్రిస్మస్ రోజున కాంతులతో మిరుమిట్లు గొలుపుతాయి.
Updated Date - 2022-12-20T11:53:50+05:30 IST