ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Book Fair in Hyderabad: నేటి నుంచి పుస్తక ప్రదర్శన..!

ABN, First Publish Date - 2022-12-22T12:46:52+05:30

ఒగ్గు కళకు వన్నె తెచ్చిన మిద్దె రాములు పేరున ప్రధాన వేదిక.

book fair in hyderabad
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాహిత్య ప్రియులు ఎంతో ఆత్రంగా ఏడాది నుంచి ఎదురు చూస్తున్న పది రోజుల పుస్తకాల పండుగ మన హైదరాబాద్ కి వచ్చేసింది. ఈరోజు నుంచి మొదలుకానుంది. ఎందరో రచయితలు, పాఠకులు, ప్రచురణకర్తలను ఒకే చోటుకు చేర్చే వేదిక ఇది. ఈ పుస్తక ప్రదర్శనకు దోమల్‌గూడలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో సిద్ధమైంది.

23 నుంచి జనవరి ఒకటి వరకు సాగే పుస్తక మహోత్సవాన్ని ఈ ఉదయం 11 గంటలకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభిస్తారు. బుక్‌ ఫెయిర్‌ సొసైటీ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికల్లో ప్రధాన వేదికకు ఒగ్గు కళకు వన్నె తెచ్చిన మిద్దె రాములు పేరును ఖరారు చేసారు. ఇక పుస్తక మహోత్సవ ప్రాంగణానికి, వ్యవస్థ వికృత రూపంపై అక్షర క్షిపణులను వదిలిన కవి అలిశెట్టి ప్రభాకర్‌ పేరును సాహిత్య వేదికకు పెట్టనున్నట్లు తెలిపారు.

పుస్తక ప్రదర్శన తేదీలు: డిసెంబర్‌ 22 నుంచి జనవరి 1 వరకు

స్థలం : దోమల్‌గూడ, ఎన్టీఆర్‌ స్టేడియం(ఇందిరాపార్కు ఎదురుగా)

సందర్శన వేళలు: మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 వరకు

శని, ఆది, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు

ప్రవేశ రుసుము:

రూ. 10

విద్యార్థులకు ఉచితం.

Updated Date - 2022-12-22T18:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising