ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా తల్లినే కొడతారా! అంటూ ఏడుస్తూనే... ఎదురుతిరిగిన మూడేళ్ల బుడ్డోడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-07-11T00:47:04+05:30

కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపించకపోగా, చిత్రహింసలు పెట్టే పిల్లలే ఎక్కువగా ఉంటారు. అలాంటి వారు ఈ బుడ్డోన్ని చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల వయసు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపించకపోగా, చిత్రహింసలు పెట్టే పిల్లలే ఎక్కువగా ఉంటారు. అలాంటి వారు ఈ బుడ్డోన్ని చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల వయసు పిల్లలు ఎలా ఉంటారని అడిగితే.. ఆటలు ఆడుకుంటూ, అదే లోకంలో గడుపుతుంటారని చెబుతాం. ఆ వయసు వారికి అభిమానం, ఆప్యాయత గురించి ఏమాత్రం అవగాహన ఉండదు అని కూడా అనుకుంటాం. కానీ ఈ బుడ్డోడి గురించి తెలుసుకుంటే మాత్రం.. మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. కళ్లెదుటే తల్లిని కొడుతుంటే.. తట్టుకోలేకపోయాడు. నా తల్లినే కొడతారా అంటూ తిరగబడ్డాడు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురిలోని కొలారస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తులసి కేవత్, సవిత దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త మాత్రం కుటుంబ బాధ్యతలను మరచి, జులాయిగా తిరిగేవాడు. దీంతో పిల్లల భవిష్యత్‌పై సవితకు ఆందోళన ఉండేది. ఎలాగైనా పిల్లలను బాగా చదివించుకోవాలని రోజూ కష్టపడేది. ఈ క్రమంలో ఆమె.. తన తల్లిదండ్రుల సహకారంతో ఏడాదిన్నర క్రితం బదర్వాస్‌లో ఓ ప్లాట్‌ను కొనుగోలు చేసింది. తల్లిదండ్రులు ఇచ్చిన కొంత మొత్తాన్ని ముందుగా చెల్లించి, మిగతా డబ్బును వాయిదాల రూపంలో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం కేవలం రెండు నెలల వాయిదాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఆ ప్లాట్‌ను రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంది.

మహిళ ఒక్కటే ఉందని మాస్టర్ ప్లాన్ వేశారు.. ఇంట్లోకి వెళ్లిన కాసేపటికి ఏం జరిగిందంటే..


అయితే ఈ విషయం తెలుసుకున్న భర్త.. ఆ స్థలాన్ని తన పేరు మీద రాయాలని పట్టుబట్టాడు. పిల్లల భవిష్యత్ కోసం తీసుకున్నానని, అది కేవలం వారి సంక్షేమానికి మాత్రమే వినియోగిస్తానని సవిత తెగేసి చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. సవితను చితకబాదాడు. అడ్డుకోవాల్సిన అత్త, మరిది కూడా భర్తకే మద్దతు ఇచ్చారు. అంతా కలిసి నేలపై పడేసి, అర్ధనగ్నంగా ఉన్న సవితపై దాడి చేశారు. దీన్ని గమనించిన ఆమె మూడేళ్ల కుమారుడు.. ఏడుస్తూ.. అమ్మను కొట్టొద్దంటూ అడ్డుపడ్డాడు. అంతటితో ఆగకుండా తన నానమ్మను కొట్టి, పక్కకు తోసేందుకు ప్రయత్నించాడు. చివరకు అంతా కలిసి ఎదిరించడంతో వారు శాంతించారు. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Viral Video: తమ్ముడిపై ఈ అన్నకు ఎంత ప్రేమో.. పక్కన కూర్చుని.. ముద్దు పెట్టి మరీ ధైర్యం చెబుతున్నాడు..



Updated Date - 2022-07-11T00:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising