ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Train Journey: తరచూ రైలు ప్రయాణాలు చేసేవాళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయమిది..!

ABN, First Publish Date - 2022-12-21T11:26:08+05:30

అలా వెళ్ళాలంటే మాత్రం సాధారణంగా రిజర్వేషన్ చేసుకున్నట్టు చేసుకుంటే చెల్లదని అంటున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైలు ప్రయాణాలు అందరికీ ఇష్టమే.. ఇతర వాహానాలలో చేసే ప్రయాణంతో పోల్చుకుంటే రైలు ప్రయాణంలో ఖర్చు కూడా చాలా తక్కువ. పైపెచ్చు బెర్త్ లు ఉంటాయి కాబట్టి హాయిగా పడుకుని ప్రయాణం చేయచ్చు. సాధారణంగా కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడానికి రిజర్వేషన్లు చేసుకుంటూ ఉంటాం. స్నేహితులతో కలసి ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా టికెట్స్ ముందుగానే ఆన్లైన్ లో రిజర్వేషన్ చేసుకుంటాం. కానీ అందరికీ సీట్లు ఒకే చోట దొరకవు. నలుగురు లేదా అయిదుగురు అయితే అడ్జస్ట్ అయిపోతారు కానీ ఏదైనా తీర్థయాత్రలకు లేదా లాంగ్ టూర్ కు కానీ ఎక్కువమంది వెళ్ళాలంటే మాత్రం ఇబ్బందే..

పెళ్ళిళ్ళు కావచ్చు, దూర ప్రాంతాలకు వేసే ట్రిప్పులు కావచ్చు, మరింకేదైనా ప్రయాణాలు కావచ్చు 50మంది వరకు వెళ్ళాలంటే మాత్రం సాధారణంగా రిజర్వేషన్ చేసుకున్నట్టు చేసుకుంటే చెల్లదని అంటున్నారు రైల్వే వారు. ఇంతకూ ఎక్కువమంది కలసి ప్రయాణం చేయాలంటే రైల్వే చెబుతున్న నిబంధనలు ఏంటి? ఎలా బుక్ చేసుకోవాలి? వంటి విషయాలు తెలుసుకుంటే..

రైలు ప్రయాణాలలో గ్రూపు రిజర్వేషన్లు చేసుకోవాలంటే ఆన్లైన్ లో చేసుకోవడం సాధ్యం కాదు. దానికోసం దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కు వెళ్ళి చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ ను కలవాలి. ఆయన దగ్గర ప్రయాణానికి సంబంధించిన విషయాలను వివరంగా చెప్పాలి. ప్రయాణానికి గల కారణమేంటి అనే ఆధారాలు కూడా చూపించాలి. అయితే ప్రయాణం చేసే అందరి పేర్లు వివరాలు వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రయాణికులకు మొత్తానికి లీడర్ గా ఒక వ్యక్తిని ఎన్నుకుని అతని వివరాలు అందిస్తే సరిపోతుంది.

ప్రయాణం చేయడానికి 48గంటల ముందు ప్రయాణికుల విషయంలో ఏమైనా మార్పలు చేసుకోవాల్సి ఉంటే చేసుకోవచ్చు. ప్రయాణికులకు లీడర్ గా చెప్పుకున్న వ్యక్తి చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ తో మాట్లాడి సవరింపులు చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇలా చేస్తే అందరికీ ఒకే బెర్త్ లో సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. అయితే ఈ వివరాలు మార్చడం కేవలం ఒకసారి మాత్రమే సాధ్యమవుతుంది.

దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయాణికుల సంఖ్యను బట్టి సంప్రదించాల్సిన అధికారులు కూడా మారుతూ ఉంటారు. 50 కంటే ఎక్కువ లేదా 100 కంటే ఎక్కువ మంది కోసం సీట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ లేదా డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ను సంప్రదించాలి. వారి సూచనల మేరకు రిజర్వేషన్ చేసుకోవాలి. పెళ్ళిళ్ల కోసం, తీర్థయాత్రల కోసం కుటుంబ సభ్యులు లేదా ఒకే ప్రాంతం వారు రిజర్వేషన్ చేసుకోవాలన్నా, కాలేజీ స్టూడెంట్స్ టూర్ ప్లాన్ చేసుకోవాలన్నా తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకుని ఉండటం అవసరం లేకపోతే ప్రయాణం ముందు ఇబ్బందులు పడటం తప్పదు.

Updated Date - 2022-12-21T11:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising