Love Story: ఇదీ నిజమైన ప్రేమంటే.. అసలు అమ్మాయిలు చూడ్డానికే ఇష్టపడని ఇతడిని..
ABN, First Publish Date - 2022-09-17T17:38:51+05:30
నిజమైన ప్రేమ మనసును చూస్తుంది కానీ అందాన్ని కాదు అనే మాటలను ఆ యువతి బలంగా నమ్మింది. అంతేకాదు వాటిని ఆచరణలో పెట్టింది. పుట్టుకతోనే కింది దవడ లేకుండా ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టిం
ఇంటర్నెట్ డెస్క్: నిజమైన ప్రేమ మనసును చూస్తుంది కానీ అందాన్ని కాదు అనే మాటలను ఆ యువతి బలంగా నమ్మింది. అంతేకాదు వాటిని ఆచరణలో పెట్టింది. పుట్టుకతోనే కింది దవడ లేకుండా ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఆ కొత్త దంపతులు స్పందించారు. వారి ప్రేమ ప్రయాణాన్ని మీడియాతో పంచుకున్నారు.
చికాగోకు చెందిన జోసెఫ్ విలియమ్స్(Joseph Williams).. ఓటోఫేషియల్ సిండ్రోమ్(Otofacial Syndrome) బారినపడ్డాడు. దీని వల్ల అతడు కింది దవడ లేకుండానే పుట్టాడు. దాని వల్ల అతడు అంద విహీనంగా కనిపించే వాడు. దీంతో చిన్నప్పుడు పొరుగున ఉండే పిల్లలు సైతం అతడితో ఆడుకునేందుకు ఇష్టపడలేదు. ఇటువంటి బాధలను దిగమింగుతూ.. స్నేహితులు లేకుండానే పెరిగి పెద్దయ్యాడు. ఈ క్రమంలో తన పరిస్థితి తలచుకుని లోలోపల ఎన్నోసార్లు కుమిలిపోయాడు. అయితే.. కొన్ని రోజుల క్రితం అతడు రియలైజ్ అయ్యాడు. తనను తాను నమ్మడం ప్రారంభించాడు. అందరిలా జీవితాన్ని సరదాగా గడపాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఓ డెటింగ్ యాప్(Dating App)లో తన ప్రొఫైల్‌ను క్రియేట్ చేశాడు. అతడి ఫొటోలు చూసి చాలా మంది యువతులు.. విలియమ్స్‌ను రిజెక్ట్ చేశారు. కానీ వనియా(Vaniya) అనే అందమైన యువతి.. అతడి జీవితంలోకి ఓ వరంలా వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన ఆమె.. విలియమ్స్‌తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత వారి పరిచయం స్నేహంగా మారింది. ఇది కాస్తా తర్వాత ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఈ ప్రేమికులు 2020లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఇద్దరి పెళ్లిని కొందరు వింతగా చూశారు. ‘అతడిని ఆమె ఎలా వివాహం చేసుకుంది’ అంటూ కామెంట్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలపై తాజాగా ఈ దంపతులు స్పందించారు. ‘విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంటానని తొలుత నేను అనుకోలేదు’ అని వనియా అన్నారు. అయితే.. అతడి మంచి తనానికి ఫిదా అయి.. పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో విలియమ్స్ మాట్లాడు..‘నేను అందరిలా కాదు. నేనొక డిఫరెంట్ వ్యక్తిని అనే విషయం నాకు తెలుసు. కానీ నేనూ మనిషినే. నాకు మనసు ఉంటుంది. అందులో ఫీలింగ్స్ ఉంటాయి. అందరిలానే నన్నూ చూడాలని కోరుకుంటున్నా. వేలెత్తి చూపించే ముందు.. నా వద్దకు వచ్చి నాతో మాట్లాడండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Updated Date - 2022-09-17T17:38:51+05:30 IST