ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నాళ్లీ ఉద్యోగాలంటూ ఈ బీటెక్ కుర్రాడి మదిలో కొత్త ఆలోచన.. రూ.లక్షతో సొంతంగా వ్యాపారం పెడితే.. ఇప్పుడు ఏకంగా..

ABN, First Publish Date - 2022-09-23T21:05:18+05:30

ఆ కుర్రాడు ఇంజినీరంగ్ చదివాడు.. చదువు అయిపోగానే ఉద్యోగం సంపాదించి సంపాదన ప్రారంభించాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ కుర్రాడు ఇంజినీరింగ్ చదివాడు.. చదువు అయిపోగానే ఉద్యోగంలో చేరి సంపాదన ప్రారంభించాడు.. అలా ఐదేళ్లలో పలు కంపెనీల్లో పని చేశాడు.. అయితే ఆ ఉద్యోగాలు అతనికి సంతృప్తి కలిగించలేదు.. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు వెళ్లిపోయాడు.. మరో స్నేహితుడితో కలిసి రూ.లక్ష పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాడు.. తేనెటీగల పెంపకం ప్రారంభించి ప్రస్తుతం సంవత్సరానికి రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడు. 


మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని బేతుల్‌కు చెందిన ఆకాష్ వర్మ (32), ఆకాష్ మగ్రూర్కర్ (33) చిన్నతనంలో కలిసి ఆడుకున్నారు. ఇంజినీరింగ్ వరకు కలిసి చదువుకున్నారు. ఆకాష్ వర్మ 2013లో ఎల్‌ఈడీ కంపెనీలో చేరాడు. 2016లో మరో కంపెనీకి మారాడు. ఆ తర్వాత 2018లో ఉద్యోగం మానేసి ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. మరోవైపు మగ్రూర్కర్ కూడా పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసి విసిగిపోయాడు. ఆకాష్ బిజినెస్ ప్లాన్ చెప్పగానే ఓకే అనేశాడు. ఇద్దరూ కలిసి రూ.లక్ష పెట్టుబడితో తేనెటీగల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పూణేలోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కార్పొరేషన్‌లో తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకున్నారు. 


తేనేటీగల పెంపకం, తేనె విక్రయం మొదలైన వాటిల్లో మెళకులవలన్నీ తెలుసుకున్న తర్వాత 2019లో తమ సొంత ప్యాకేజింగ్‌తో తేనె అమ్మడం ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌తో పాటు రాజస్థాన్, హిమాచల్, పంజాబ్‌లలో కూడా ఇ-కామర్స్ సైట్ల ద్వారా వారు తేనెను విక్రయిస్తున్నారు. అలాగే స్వయంగా తేనెటీగల పెంపకం కూడా ప్రారంభించారు. వీరు సంవత్సరానికి 5 టన్నుల కంటే ఎక్కువ తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. లక్ష రూపాయలతో ప్రారంభమైన కంపెనీ టర్నోవర్ నేడు 30 లక్షల రూపాయలకు చేరుకుంది . తేనె ఉత్పత్తి, విక్రయాలు పెరగడంతో కంపెనీలో స్టాక్, ముడిసరుకు, ప్యాకేజింగ్, సైలెన్సర్, మిక్సర్, గ్రైండర్, ప్రింటింగ్ వంటి యంత్రాలను ఏర్పాటు చేశారు.


జూన్ 2020లో పచ్చళ్లను తయారు చేయడం కూడా ప్రారంభించారు. స్నేహితులిద్దరూ పచ్చి మామిడికాయలతో రకరకాల పచ్చళ్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఏడాదికి ఏడెనిమిది టన్నుల పచ్చళ్లు అమ్ముతున్నారు. పచ్చళ్ల కోసం స్వంతంగా సేల్స్ మెన్‌లను కూడా నియమించుకున్నారు. మహిళలకు ఉపాధి కల్పించేందుకు దేశీయ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించాలనుకుంటున్నారు. 

Updated Date - 2022-09-23T21:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising