Viral Video: కారులో వెళ్తున్న ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి మరీ ఈ ఎలుగుబంటి చేసిన పనికి అంతా ఫిదా.. ఏకంగా 17 మిలియన్ల వ్యూస్
ABN, First Publish Date - 2022-06-17T21:31:40+05:30
కోపం వస్తే బీభత్సం సృష్టించే జంతువులు.. ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అచ్చం మనుషుల మాదిరే ప్రవర్తించడమే కాకుండా స్నేహం కూడా చేస్తుంటాయి. మనుషులతో స్నేహం..
కోపం వస్తే బీభత్సం సృష్టించే జంతువులు.. ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అచ్చం మనుషుల మాదిరే ప్రవర్తించడమే కాకుండా స్నేహం కూడా చేస్తుంటాయి. మనుషులతో స్నేహం చేసే సింహాలు, పులులు, ఏనుగులు, కోతులు తదితర జంతువులను చాలా చూశాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఎలుగుబంటి ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి ఎలుగుబంటి చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రుమేనియాలోని అడవి దారిలో రోడ్డుపై కొన్ని వాహనాలు ఆగి ఉంటాయి. పక్కనే ఉన్న కొన్ని ఎలుగుబంట్లు వాహనాల వద్దకు వస్తాయి. వాటిని వాహనదారులు ఆసక్తిగా గమనిస్తుంటారు. కానీ వాటి వద్దకు వెళ్లే ధైర్యం మాత్రం చేయరు. అయితే ఓ వాహనదారుడు మాత్రం కారు కిటికీ నుంచి చేయి ఊపుతాడు. అతన్ని గమనించిన ఓ ఎలుగుబంటి కారు వద్దకు వెళ్తుంది. దీంతో అతను భయం భయంగానే హాయ్ అని చేయి ఊపుతాడు.
నాతోనే తమాషా.. వెకిలి చేష్టలు చేసిన యువకుడికి చుక్కలు చూపించిన గొరిల్లా..
అందుకు సమాధానంగా ఎలుగుబంటి కూడా ఎంతో ఉత్సాహంగా అతనికి హై పైవ్ ఇస్తుంది. నేను వెళ్లొస్తా... అన్నట్లుగా తర్వాత అక్కడి నుంచి తోటి ఎలుగుబంట్ల వద్దకు వెళ్లి కూర్చుంటుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటిదాకా 17 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఇది ప్రెండ్లీ ఎలుగుబంటి అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.
షాకింగ్ వీడియో: ఎలుగు బంటిని చూడగానే ఆనందంతో దాని వైపే పరుగులు తీసిన చిన్న పాప.. చివరకు..
Updated Date - 2022-06-17T21:31:40+05:30 IST