Viral Video: తమ్ముడిపై ఈ అన్నకు ఎంత ప్రేమో.. పక్కన కూర్చుని.. ముద్దు పెట్టి మరీ ధైర్యం చెబుతున్నాడు..
ABN, First Publish Date - 2022-07-10T00:35:09+05:30
చిన్న పిల్లల ప్రవర్తన ఒక్కోసారి చూడముచ్చటగా ఉంటుంది. బుడి బుడి అడుగులు వేస్తూ.. వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈ వయసు పిల్లలు ఉన్న ఇల్లు.. ఎంత సందడిగా ఉంటుందో..
చిన్న పిల్లల ప్రవర్తన ఒక్కోసారి చూడముచ్చటగా ఉంటుంది. బుడి బుడి అడుగులు వేస్తూ.. వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈ వయసు పిల్లలు ఉన్న ఇల్లు.. ఎంత సందడిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. గుండ్రంగా తిరుగుతున్న బొమ్మ కార్లలో కూర్చున్న తమ్ముడు ఏడుపు మొదలెట్టాడు. అయితే కాసేపటికి అన్న పక్కన కూర్చోగానే రైడ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఎగ్జిబిషన్‌లో గుండ్రంగా తిరుగుతున్న బొమ్మ కార్లలో ఇద్దరు పిల్లలు కూర్చుని ఉంటారు. ముందు రెండేళ్ల చిన్నారి, వెనుక మూడేళ్ల చిన్నారి కూర్చుని రైడ్ చేస్తుంటారు. అయితే రైడ్ మొదలైన కాసేపటికి తమ్ముడు ఏడుపు మొదలెడతాడు. దీంతో ఆపరేటర్ రాట్నాన్ని ఆపేస్తాడు. తర్వాత అన్నను తమ్ముడి పక్కన కూర్చోబెట్టి స్టార్ట్ చేస్తారు. ఏడుస్తున్న తమ్ముడి మీద చేయి వేసిన అన్న.. నేనున్నాగా! భయమెందుకు.. అన్నట్లుగా ధైర్యం చెబుతాడు. తర్వాత తమ్ముడికి సున్నితంగా ముద్దు పెడతాడు. దీంతో చిన్నారి ఏడుపు ఆపేసి.. రైడ్‌ను ఎంజాయ్ చేస్తాడు. ఈ వీడియోలో పిల్లల ప్రవర్తనకు.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆహా.. వీరు అపూర్వ సహోదరులు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Viral Video: ఈ ఉడుత చాలా స్మార్ట్ గురూ.. అనుమానిస్తూనే... అర చేతిలోని బాదం పప్పును ఎలా తింటోందో చూడండి..
Updated Date - 2022-07-10T00:35:09+05:30 IST