ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్ మిసైల్.. అయినా చలించకుండా.. గడ్డం గీసుకుంటున్న వ్యక్తి..

ABN, First Publish Date - 2022-06-27T00:17:10+05:30

రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడున్నర నెలలకు పైగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రష్యా సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. అయినా ఉక్రెయిన్ సేనలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. రష్యాకు దీటుగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడున్నర నెలలకు పైగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రష్యా సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. అయినా ఉక్రెయిన్ సేనలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. రష్యాకు దీటుగా సమాధానం చెబుతున్నారు. ఇదిలావుండగా, ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఉక్రెయిన్ వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అయితే కొందరు మాత్రం అన్నిటికీ తెగించి.. తమ రోజు వారీ పనులు చేసుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్‌లోని ఓ ఇంట్లోకి రాకెట్ మిసైల్ దూసుకొచ్చింది. అయినా ఇంట్లో ఉన్న వ్యక్తి.. ఏమాత్రం భయపడకుండా దాని పక్కనే నిల్చుని గడ్డం గీసుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది..


సోషల్ మీడియాలో ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా ఉక్రెయిన్ వాసులకు సంబంధించిన వీడియోలు ఇటీవల నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. యుద్ధం ప్రారంభంలో ఉక్రెయిన్ వాసులు భయాందోళనలకు గురయ్యారు. అయితే నెలలుగా యుద్ధం జరుగుతూనే ఉండడంతో కొందరు.. భయాన్ని వదిలేసి, రోజువారీ కార్యకలాపాల్లో మునిగిపోతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి యుద్ధ వాతావరణంలోనే తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

చోరీకి వెళ్లిన ఇంట్లోనే మందేసిన దొంగలు.. ఖరీదైన మద్యం బాటిళ్లు ఖాళీ చేసేశారు.. రూ.22 లక్షల విలువైన..


తాజాగా, ఉక్రెయిన్ వ్యక్తికి సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. రష్యాకు చెందిన రాకెట్ మిసైల్.. ఉక్రెయిన్‌లోని ఓ ఇంట్లోకి దూసుకొచ్చింది. అప్పటికే యుద్ధ వాతావరణానికి అలవాటుపడిన ఆ ఇంట్లోని వ్యక్తి, ఇదంతా మామూలే కదా! అనుకుంటూ మిసైల్ పక్కనే నిల్చుని గడ్డం గీసుకుంటూ ఉంటాడు. పక్కనే రాకెట్ మిసైల్ వేలాడుతూ ఉంటుంది. ఇంటి సీలింగ్ నుంచి దూసుకురావడంతో సీలింగ్‌కు పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. తర్వాత ఆ వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. దెబ్బతిన్న తన ఇంటిని చూపిస్తాడు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

భర్త ఎదుటే భార్యపై చేయి వేసిన యువకుడు.. నా భార్యపై నీ పెత్తనం ఏంటీ.. అని భర్త ప్రశ్నించడంతో.. చివరకు..



Updated Date - 2022-06-27T00:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising