Viral Video:- మొబైల్ షాప్ లో చోరి.. ఫోన్ తీసుకుని పారిపోయిన దొంగ.. యజమాని తెలివి సూపర్..

ABN, First Publish Date - 2022-12-14T11:06:41+05:30

మేనేజర్ ఆదమరచి ఉన్న సమయం చూసి మొబైల్ చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా

Viral Video:- మొబైల్ షాప్ లో చోరి.. ఫోన్ తీసుకుని పారిపోయిన దొంగ.. యజమాని తెలివి సూపర్..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక వ్యక్తి మొబైల్ షాపుకు వెళ్ళాడు. అక్కడ షాపు మేనేజర్ మొబైల్స్ అన్నీ చూపిస్తుండగా అతనికి ఒక మొబైల్ చాలా బాగా నచ్చేసింది. అతను అటూ ఇటూ గమనించి మేనేజర్ ఆదమరచి ఉన్న సమయం చూసి మొబైల్ చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా పరుగు మొదలుపెట్టాడు. అయితే అలా వెళ్లినవాడు అంతలోనే దొరికిపోయాడు ఎలాగంటే..

మొబైల్ తీసుకుని పారిపోయిన దొంగ షాపు తలుపుదాటి బయటకు వెళ్ళలేక పోయాడు. కారణం ఏమిటంటే.. ఆ షాపుకు జామ్ డోర్స్ సెట్ చేసారు అంట. ఈ డోర్స్ ను నార్మల్ గా తోసుకుని వెళ్ళడం సాధ్యం కాదు. వాటిని స్లైడ్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ కారణం వల్ల షాపు నుండి అడుగు బయటకు పెట్టకుండానే దొరికిపోయాడు ఆ దొంగ.

షాపులో ఉన్న సిసికెమెరాలో జరిగింది మొత్తం రికార్డ్ అయ్యింది. ఇక బయటకు వెళ్ళలేనని అర్థమైపోయాక సదరు దొంగ అక్కడ తన పప్పులు ఉడకవని అర్థం చేసుకున్నాడో ఏమో మెల్లిగా వెనక్కు వచ్చి మొబైల్ ను మేనేజర్ ముందు పెట్టేశాడు. మేనేజర్ తనని ఏం చేస్తాడో అనే భయంతో తనను వదిలిపెట్టమంటూ బ్రతిమాలుకున్నాడట.

ఇలా అడ్డంగా దొరికిపోయి తరువాత కాళ్ళబేరానికి దిగాడు దొంగ. ఈ వీడియో చూసిన నెటిజన్లు దొంగల చేష్టలకు తగ్గట్టు షాపు నిర్వాహకులు ఈ మాత్రం తెలివిగా లేకపోతే కష్టమని అంటున్నారు. కాగా సదరు దొంగ తీసుకుని పారిపోదామని ప్రయత్నించిన మొబైల్ ఖరీదు 1600 పౌండ్స్ అంట. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా లక్షా అరవై వేల రూపాయలకు పైమాటే.. మొబైల్ ఖరీదు విన్నవాళ్ళు దొంగ చాలా స్మార్ట్ అందుకే అంత కాస్ట్లీ మొబైల్ ను ఎంచుకున్నాడు అని చమత్కారం కూడా చేస్తున్నారు.

Updated Date - 2022-12-14T11:08:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising