రైల్వే స్టేషన్‌లో కంగారుగా కనిపించిన ఓ బాలిక, ఓ కుర్రాడు.. అనుమానంతో ఆరా తీసిన పోలీసులు.. అసలు నిజం తెలిసి..
ABN, First Publish Date - 2022-06-28T23:08:46+05:30
వారిద్దరూ మైనర్లు.. కొన్ని రోజులు గడిస్తే మేజర్లు కాబోతున్నారు. అయితే ఈ క్రమంలో రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై కంగారుపడుతూ కనిపించారు. పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో.. పొంతన లేని సమాధానాలు చెప్పారు..
వారిద్దరూ మైనర్లు.. కొన్ని రోజులు గడిస్తే మేజర్లు కాబోతున్నారు. అయితే ఈ క్రమంలో రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై కంగారుపడుతూ కనిపించారు. పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో.. పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం మరింత బలపడింది. స్టేషన్‌కి తీసుకెళ్లి లోతుగా విచారించగా చివరకు.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పరుఖాబాద్‌కు చెందిన ఇద్దరు మైనర్లు.. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో మేజర్లు కాబోతున్నారు. ఈ క్రమంలో బాలిక సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు. సోమవారం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని బాలిక తన ప్రియుడికి తెలియజేసింది. దీంతో ఎవరికీ తెలియకుండా ప్రియురాలిని తన బైక్‌పై ఎక్కించుకుని, 200కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాకు చేరుకున్నారు. అక్కడి రైల్వే స్టేషన్‌లో బైక్ పార్క్ చేసి, రైల్లో అహ్మదాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
వాసన వస్తోందేంటని అడిగిన మరిది.. ఎలుక చచ్చిందన్న వదిన.. బాత్రూంలో భర్త శవాన్ని దాచి ఓ భార్య నిర్వాకమిదీ..!
ఈ క్రమంలో ప్లాట్‌ఫాంపై ఇద్దరూ రైలు కోసం కంగారుగా వేచి చూస్తూ ఉన్నారు. అక్కడే ఉన్న రైల్వే చైల్డ్ లైన్ అధికారి.. వారిని చాలా సేపు గమనించాడు. అనుమానం రావడంతో ఇద్దరినీ పిలిచి ప్రశ్నించాడు. అయితే వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాడు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం ప్రేమికులను ఇద్దరినీ రైల్వే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.
రాత్రికి రాత్రే ఇంట్లోంచి అదృశ్యమైన అత్త, అల్లుడు.. కంగారుగా ఊరంతా వెతికిన భార్య.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
Updated Date - 2022-06-28T23:08:46+05:30 IST