రాత్రిపూట కడుపునొప్పితో అల్లాడిపోతున్న 10 ఏళ్ల కూతురు.. పరీక్షలు చేశాక డాక్టర్ చెప్పింది విని..
ABN, First Publish Date - 2022-04-20T22:33:29+05:30
ఇటీవల బాలికలపై దాడులు పెరిగిపోతున్నాయి. అభం, శుభం తెలీని చిన్నారులు.. కామాంధుల దాడుల్లో బలవుతున్నారు. ఇలాంటి దాడులను నివారించేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా...
ఇటీవల బాలికలపై దాడులు పెరిగిపోతున్నాయి. అభం, శుభం తెలీని చిన్నారులు.. కామాంధుల దాడుల్లో బలవుతున్నారు. ఇలాంటి దాడులను నివారించేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. మార్పు మాత్రం రావడం లేదు. బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. రాత్రిపూట కడుపునొప్పితో అల్లాడిపోతున్న పదేళ్ల కూతురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన అనంతరం డాక్టర్లు చెప్పింది విని, తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అసలు ఏం జరిగిందంటే..
బీహార్ రాష్ట్రం పాట్నాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఈ దంపతులకు 10ఏళ్ల కుమార్తె ఉంది. భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం కూడా ఇద్దరూ పని నిమిత్తం బయటికి వెళ్లారు. అదే సమయంలో స్థానికంగా ఉన్న ఓ బాలుడు.. బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించాడు. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసి, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక భయంతో అలాగే ఉండిపోయింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు బాలిక ప్రవర్తనను గమనించి ప్రశ్నించారు. అయినా ఆమె ఏమీ చెప్పలేదు.
పొద్దున్నే టిఫిన్ ఇచ్చిన భార్య.. ఒక్క స్పూన్ తిని పక్కన పెట్టేసి గదిలోకి వెళ్లిన భర్త.. మరుక్షణంలోనే..
అయితే కాసేపటికి ఆమెకు వాంతులు, కడుపు నొప్పి ఎక్కువ అయింది. దీంతో మంగళవారం ఆమెను చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకుని, బుధవారం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రిపోర్టులు వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
అమ్మా.. నాన్నా.. ఓ అంకుల్.. భయంతో అల్మారాలో దాక్కున్నానంటూ 7 ఏళ్ల పిల్లాడు చెప్పిన మర్డర్ మిస్టరీ..!
Updated Date - 2022-04-20T22:33:29+05:30 IST