అక్కా.. నేను బతకనేమో.. తొందరగా రా.. అంటూ తమ్ముడి నుంచి ఫోన్.. డబ్బుల్లేక మూడు రోజుల తర్వాత ఆమె వచ్చి చూస్తే..
ABN, First Publish Date - 2022-06-26T01:34:33+05:30
అతడు ఉపాధి నిమిత్తం ఇంటికి దూరంగా ఉంటున్నాడు. అయితే ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. పరామర్శించడానికి పక్కన ఎవరూ లేరు. దీంతో ఆస్పత్రిలో చూపించుకుని, అక్కకు ఫోన్ చేశాడు. ‘‘అక్కా నేను..
అతడు ఉపాధి నిమిత్తం ఇంటికి దూరంగా ఉంటున్నాడు. అయితే ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. పరామర్శించడానికి పక్కన ఎవరూ లేరు. దీంతో ఆస్పత్రిలో చూపించుకుని, అక్కకు ఫోన్ చేశాడు. ‘‘అక్కా నేను బతకనేమో.. తొందరగా రా’’.. అంటూ ఫోన్ చేశాడు. దీంతో కంగారు పడ్డ అక్క.. తమ్మున్ని చూడటానికి వెళ్లాలి అనుకుంది. కానీ ఆమె వద్ద డబ్బులు లేవు. దీంతో అతి కష్టం మీద మూడు రోజుల తర్వాత వెళ్లింది. అయితే అక్కడి దృశ్యం చూసి షాక్ అయింది. వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్ రాష్ట్రం కత్రాస్ బజార్ గ్రామానికి చెందిన సపన్‌కుమార్(40).. ఉపాధి నిమిత్తం రాజస్థాన్‌లోని ఆల్వార్ పరిధి గూంద్‌పూర్ గ్రామంలో ఉంటున్నాడు. ఇతడికి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వారంతా సొంత ఊర్లోనే ఉంటున్నారు. ఇదిలావుండగా, సపన్‌కుమార్ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తుండేవాడు. అయితే ఈ ఏడాది జనవరిలో అతడికి టీబీ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. ఇటీవల సమస్య తీవ్రమవడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సోలంకి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 19న తన అక్కకు ఫోన్ చేశాడు. ‘‘అక్కా.. నేను బతకనేమో.. తొందరగా రా’’.. అని చెప్పాడు.
విడాకుల కేసులో షాకింగ్ తీర్పు.. భర్తకు ప్రతీ నెలా రూ.25 వేలు భరణం చెల్లించాలంటూ భార్యకు ఆదేశాలు..!
దీంతో కంగారుపడిన అతడి అక్క పింకి.. తమ్ముడి వద్దకు వెళ్లానుకుంది. అయితే ఆమె వద్ద చార్జీలకు కూడా డబ్బు లేకపోవడంతో ఆగిపోయింది. మూడు రోజుల తర్వాత 22న ఎలాగోలా డబ్బు సర్దుకుని, తమ్ముడి వద్దకు బయలుదేరింది. అయితే అక్కడికి వెళ్లిన పింకీకి.. అదే రోజు తమ్ముడు చనిపోయాడని తెలిసింది. దీంతో బోరున విలపించింది. అయితే తమ్ముడి మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లడానికి కూడా ఆమె వద్ద డబ్బు లేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది సహకారంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.
న్యాయం చేయండంటూ రెండు చేతులూ లేని బాలిక కాళ్లతో రాసిందో లేఖ.. నేరుగా ఇంటికే వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి..
Updated Date - 2022-06-26T01:34:33+05:30 IST